– పైరవీలు, లీకేజీలు, లంచాలకు తావులేకుండా ఉద్యోగాల భర్తీ చేస్తున్న ఘనత మోదీదే
– గత మూడేళ్లలో 11 లక్షల ఉద్యోగాల భర్తీ
– నేడు 61 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం గొప్ప విషయం
– డబ్బుల్లేక అర్ధాకలితో చదువుకుంటున్న బాధలు ప్రధానికి తెలుసు
– రోజ్ గార్ మేళా మోదీకి ఇష్టమైన కార్యక్రమం
– ఉద్యోగులారా…. మీ బాధ్యతను విస్మరించొద్దు
– ఎవరో మాటలు విని సమ్మె చేస్తే నష్టపోతారు
– నిరుద్యోగులారా…నిరాశ పడకండి
– హైదరాబాద్ హకీంపేట ‘‘రోజ్ గార్ మేళా’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్
– దేశవ్యాప్తంగా 61 వేల మందికి ఉద్యోగ నియమాక పత్రాల అందజేత
హైదరాబాద్: ఏ చిన్న అవినీతికి, పొరపాట్లకు, పైరవీలకు తావులేకుండా నిరంతరం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఠంచన్ గా లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు.
‘‘గతంలో ఏ ప్రభుత్వమూ ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసిన దాఖలాల్లేవ్. అవినీతి, అక్రమాలు, పైరవీలు లేకుండా గత పాలకులు ఉద్యోగాల భర్తీ చేయలేదు. భవిష్యత్తులోనూ చేస్తారనే నమ్మకం లేదు. ఆ క్రెడిట్ మోదీకే దక్కుతోంది. ఒక్క రోజ్ గార్ మేళానే కాదు, కేంద్రంలోని అన్ని విభాగాల్లోనూ అవినీతికి తావు లేకుండా గత 11 ఏళ్లుగా అద్బుతమైన పాలన కొనసాగిస్తున్న మహానేత మోదీజీ… హ్యాట్సాఫ్ మోదీజీ’’అని కొనియాడారు.
హైదరాబాద్ లోని హకీంపేట సీఐఎస్ఎఫ్ నిసా అంతరిక్ష ఆడిటోరియంలో నిర్వహించిన ‘‘18వ రోజ్ గార్ మేళా’’కు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐఎస్ఎఫ్ నిసా ఐజీ డీపీ పరిహార్, డీఐజీ అనిల్ డామోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ తన చేతుల మీదుగా 61 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సంజయ్ ఏమన్నారంటే.. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’. 2022 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు 17 రోజ్ గార్ మేళాల ద్వారా 11 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈరోజు నిర్వహించే 18వ రోజ్ గార్ మరో 61 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నం. చాలా సంతోషంగా ఉంది. యువతపై మోదీకి ఉన్న అభిమానానికి ఇది నిదర్శనం.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ నిరాశ, నిస్ప్రహలతో బాధపడుతున్న యువతకు ఈ వేదిక ద్వారా భరోసా ఇస్తున్నాం. కష్టపడి ప్లాన ప్రకారం చదివితే వాళ్లకు సైతం ఉద్యోగాలు వస్తాయి. రోజ్‌గార్ మేళా ఒక రోజుతో ముగిసేది కాదు. నిరంతర ప్రక్రియ. ప్రతి మేళా వేల కుటుంబాల్లో వెలుగు నింపుతోందనే విషయాన్ని గుర్తుంచుకోండి.
నిరుద్యోగం ఎంత దారుణంగా ఉంటుందో, నిరుద్యోగుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో నేను కళ్లారా చూసిన. హైదరాబాద్ అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగుల పడుతున్న బాధలను, ఆకలి బాధలను చూసిన. డబ్బులు లేక ఒకే పూట తిండి తింటూ ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది తినడానికి డబ్బుల్లేక 2 అరటి పండ్లు తిని కడుపు నింపుకున్న ద్రుశ్యాలు చూసిన. మోదీకి ఇవన్నీ తెలుసు. కాబట్టే రోజ్ గార్ మేళా పేరుతో ఏ చిన్న అవినీతికి, పొరపాట్లకు తావులేకుండా నిరంతరం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఠంచన్ గా లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఇది మామూలు విషయం కాదు. మోదీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసిన దాఖలాల్లేవ్. అవినీతి, అక్రమాలు, పైరవీలు లేకుండా గత పాలకులు ఉద్యోగాల భర్తీ చేయలేదు. భవిష్యత్తులోనూ చేస్తారనే నమ్మకం లేదు. ఆ క్రెడిట్ మోదీకే దక్కుతోంది. ఈ రోజ్ గార్ మేళానే కాదు, అవినీతికి తావు లేకుండా గత 11 ఏళ్లుగా అద్బుతమైన పాలన కొనసాగిస్తున్న మహానేత మోదీజీ… హ్యాట్సాఫ్ మోదీజీ…
ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఫీజులు, కోచింగ్ ల కోసం అప్పులు తెచ్చి మరీ ఫీజు చెల్లించి ఉంటారు. నిన్నటిదాకా నా బిడ్డకు ఉద్యోగం వస్తుందా? అని దేవుడిని మొక్కుకుని ఉంటారు.. ఇయాళ మీ ఆశలు నెరవేరాయి. అందుకే మీ కళ్లల్లో ఆనందం కన్పిస్తోంది. ముఖంలో గర్వం కన్పిస్తోంది. మీ పిల్లల కోసం మీరు పడిన కష్టానికి, త్యాగానికి వచ్చిన ఫలితమిది. అందుకే మీ అందరికీ హ్యాట్సాఫ్…
నిన్నటి వరకు మీరంతా నిరుద్యోగులు. ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియక మానసికంగా ఇబ్బంది పడి ఉంటారు. కానీ ఈరోజుతో ఆ బాధ పోయింది. ఈరోజు నుండి మీరంతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయినని గర్వంగా చెప్పుకోగలరు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే జీతం మాత్రమే కాదు. పెన్షన్ మాత్రమే కాదు. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం. మీ జీవితం ఇక్కడితోనే ఆగిపోకూడదు. పోస్ట్‌మాన్ స్థాయి నుండి ప్రొఫెసర్ స్థాయివరకు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే మీకు అప్పగించిన పనిని సక్రమంగా, నిజాయితీతో ఇష్టపడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకోండి. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీని, ఉద్యోగాల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగండి.
ఎవరో చెప్పిన మాటలు విని సమ్మె చేస్తే నష్టపోతారు. గతంలో పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలిస్తే… తెలిసీ తెలియక ఆ పోస్టల్ ఉద్యోగులంతా చెప్పుడు మాటలు విని సమ్మె చేస్తే మోదీ ప్రభుత్వం ఒక్క నోటీస్ తో 25 వేల మందిని సస్పెండ్ చేశారు. సేవ చేయాల్సిన ఉద్యోగులు తెలిసీ తెలియక సమ్మెల పేరుతో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తానంటే, ఆ శాఖకు నష్టం చేస్తామంటే ఊరుకునే ప్రభుత్వం మోదీది కాదు.
వాస్తవాలను అర్ధం చేసుకున్న పోస్టల్ ఉద్యోగులు నా వద్దకు వచ్చి తెలిసీ తెలియక ఎవరో చెబితే సమ్మెలో పాల్గొన్నామని, పొరపాటైందని చెబితే…నేనే కేంద్ర మంత్రితో మాట్లాడి ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేయించిన. దయచేసి ఎవరో ఏదో చెప్పారని, మీ ఉద్యోగ ధర్మాన్ని, బాధ్యతను విస్మరించవద్దని కోరుతున్నా.
ఎన్నికల హామీతో పని లేకుండా నిరంతరం ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీది. అందుకే దేశ ప్రజలు వరుసగా మూడుసార్లు అధికారాన్ని అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్రమం తప్పకుండా వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తూ లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
అంతేగాదు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పేరుతో ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉద్యోగాలు స్రుష్టించే స్థాయికి మన భారతీయ యువతను ప్రోత్సహిస్తున్నారు. కరోనా హయాంలో అమెరికాసహా ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతే ఆత్మ నిర్భర్ ప్యాకేజీతో భారత్ ను ఆర్ధికంగా స్థిరంగా ఉంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదే.
అంతేగాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అగ్రభాగాన నిలిచేందుకు నిరంతరం క్రుషి చేస్తున్నారు. గతంలో 11వ స్థానంలో ఉన్న భారత్ ను 4వ స్థానంలో నిలిపారు. త్వరలోనే 3వ స్థానానికి తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా అప్పటికి అమెరికా, చైనాను అధిగమించి భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా మార్చి ‘విశ్వగురు’ స్థానంలో నిలపాలన్నదే మోదీగారి ఆకాంక్ష. ఈ యజ్ఝంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా.