రాజ్యాంగం అంటే ఏమిటి? ఒక దేశ సర్వోన్నతమైన, మౌలికమైన చట్టాలు, చట్ట విధానాల కూర్పు రాజ్యాంగం అని ప్రాథమికంగా మనం తెలుసుకోవచ్చు. రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధానాలు, పౌరుల హక్కులు ఉంటాయి; ఉండాలి. మనదేశానికి సంబంధించి రాజ్యాంగం అన్నది 26/1/1950 నుండి అమలులోకి వచ్చింది. అంతకు ముందు ఇంగ్లిష్ పాలనలో రాజ్యాంగం అన్నది లేదు. స్వతంత్ర భారతం వచ్చాక ఈ రాజ్యాంగం ఆచరణబద్ధం అయింది.
మన దేశ రాజ్యాంగానికి ఆధార రచన లేదా మూల రాజ్యాంగాన్ని రాసింది సర్. బెణగళ్ నరసింహారావు. ఆయన 1946లో మొదలు పెట్టి 1948లో మన దేశ మౌలిక లేదా ఆధార రాజ్యాంగాన్ని రాయడం పూర్తి చేశారు. అటు తరువాత అది అంబేడ్కర్ అధ్యక్షుడుగా ఉన్న 8 మంది సభ్యుల కమిటికి వెళ్లింది. రాజ్యాంగం రచనలో 22కమిటీల సభ్యుల భాగస్వామ్యం ఉంది.
అంతవరకూ ‘ప్రజా క్షేత్రంలోనూ, రాజకీయంగానూ ఎంత మాత్రమూ ఆదరణ లేని, పలు తిరస్కారాలను, వైఫల్యాలను పొందిన అంబేడ్కర్ కొందరు విద్యావంతుల సంస్కారం, సహకారంతో మాత్రమే రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడయ్యారు’ అన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవడం, స్మరించుకోవడం అవసరం.
రాజ్యాంగ నిర్మాణంలో పునాది, కీలకం అయిన సర్. బెణగళ్ నరసింహారావును లేకుండా చేసి రాజ్యాంగ కర్తృత్వాన్ని పూర్తిగా అంబేడ్కర్‌కు అంటగట్టడం గత కొన్ని దశాబ్దులుగా దేశంలో బలపడుతూ వస్తున్న అపాయకరమైన దోషం. ఇది ఏదైనా కుట్రలో భాగమా? పలువురి కృషి ఫలితం ఇవాళ్టి మన రాజ్యాంగం. పలువురి మేధ, ఆలోచన, కృషి వీటిని అంబేడ్కర్‌కు మాత్రమే ఆపాదించడం చదువు, నిజం, తెలివిడి వీటికి వ్యతిరేకం.
10 – 35 (29+6=35) మార్కుల చదువుకు అతీతంగా రాజ్యాంగ కర్తృత్వం విషయంలో మనకు మనోవికాసం, ‘ఉన్న విషయం’ ఇకనైనా అవసరం. మోసం ఎంత కాలం? ద్వేషం ఎన్నేళ్లు? ఇకచాలు.
1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు బీ.ఆర్. అంబేడ్కర్ ముసాయిదాను ప్రవేశపెడుతూ ‘భారత రాజ్యాంగ రచనలో సింహభాగం కర్తృత్వం బెణగళ్ నరసింహారావుది’ అన్న నిజాన్ని గట్టిగా చెప్పారు. ఆ అంబేడ్కర్ మాటలు సరైన అవగాహనను ఇస్తున్నాయి.
రాజ్యాంగం ముసాయిదాను రూపొందించే ముందు సర్. బెణగళ్ నరసింహారావు జర్మనీ, అమెరికా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్ దేశాల్లో పర్యటించారు. ఆ దేశాల న్యాయ నిపుణులతో చర్చలు చేశారు. అప్పటి అమేరిక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఫెలిక్స్ ఫ్రాంక్ ఫార్టర్ (Felix Frankfurter) ఇచ్చిన విలువైన సూచనలనెన్నో బెనగళ్ తీసుకున్నారు. తన విస్తృత పరిచయాలను ఉపయోగించుకుని ఇతర దేశాల్లోని పలు ప్రముఖ న్యాయ వేత్తల సలహాలు తీసుకున్నారు. ఈ పని అంబేడ్కర్ చెయ్యలేదు. చెయ్యగల పరిధి, విస్తృతి, అవకాశం, ఆలోచన అంబేడ్కర్‌కు ఉన్నట్టు లేదు.
1935లో బ్రిటిష్ పా(ర్)లమంట్ ఆమోదించిన భారతదేశ చట్టాలను నరసింహారావు పరిగణనలోకి తీసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం నరసింహ రావుకు ‘సర్ – నైట్ హుడ్’ను ప్రదానం చేసింది. దేశ ప్రజలతోనే కాదు బ్రిటిష్ పాలకుల చేత కూడా ‘అంబేడ్కర్ తిరస్కరించబడ్డారు’ అన్న సత్యాన్ని తెలుసుకోవడం కులోన్మాదానికి, అసభ్యకరమైన భాషకు, సంకుచిత్వానికి అతీతమైన ‘సంస్కారం’, మనోవికాసం.
నరసింహారావు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఆయన తన అనుభవం, చదువు, జ్ఞానంతో భారత రాజ్యాంగం మౌలిక ప్రతిని సిద్ధం చేశారు. 1947 అక్టోబర్‌లో నరసింహారావు రాజ్యాంగం ముసాయిదాను, ఇతర కమిటీల నివేదికలను రాజ్యాంగ సభకు సమర్పించారు. వీటిపై విస్తృత చర్చలు జరిగాయి. 1948 ఫెబ్రుఅరి (february)లో ఈ ముసాయిదా తొలి రచనను ప్రచురించారు.
ఈ కీలకమైన ముసాయిదాపై ప్రజాభిప్రాయం కోసం, విమర్శకుల సూచనలు, సలహాల కోసం ఎనిమిది నెలల సుదీర్ఘ సమయమిచ్చారు. ఆ కాలంలో వచ్చిన వందలాది అంశాలను పరిగణనలోకి తీసుకుని 1948 నవంబర్ 4న ఈ ముసాయిదాను ఆధికారికంగా డ్రాఫ్టింగ్ కమిటీ ముందుకు తీసుకొచ్చారు. అక్కడ మొదటి పఠనం లేదా ప్రెజెంటేషన్ జరిగింది.
ఆ తర్వాత సంవత్సరం కాలం పాట అధికరణాలపై విస్తృత చర్చ జరిగింది. అలా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు తీసుకుంటూ సవరించిన ముసాయిదా రెండో, మూడో మీటింగ్ జరిగింది. మూడో పఠనం వరకు అందిన సూచనలను పరిశీలించి మార్పులు చేర్పులు చేశాక ఆ ముసాయిదా ప్రతిని 1949 నవంబర్ 25న అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంలో అంబేడ్కర్ బెనగళ్ నరసింగరావు సేవల్ని ప్రస్తావించి కొనియాడారు. అలాగే మిగతా సభ్యుల సేవలు ఎంతో విలువైనవి అన్నారు. రాజ్యాంగ రచన కమిటీ (డ్రాఫ్టింగ్ కమిటీ) 114 సార్లు సమావేశమై చర్చలు చేసింది. ఇందుకోసం రెండు సంవత్సరాల పదకొండు నెలల 17 రోజుల సమయం పట్టింది. ముసాయిదాపై 7,635 సవరణలు అందగా 2,473 సవరణలు అంగీకరా యోగ్యం అయ్యాయి. ఇక్కడ డాక్టర్ సచ్చిదానంద సిన్హా పేరు కూడా స్మరణీయం.
రాజ్యాంగానికి పీఠికను అప్పటి ప్రధాని నెహ్రూ రాశారు. కమిటీ సభ్యులైన అల్లాడి కుప్పు స్వామి అయ్యర్, కె.ఎమ్. మున్షీ, డీ.పీ ఖైతాన్ ప్రభృతుల ఆలోచనలు, మేధ కూడా రాజ్యాంగ రచనలో ఇమిడాయి. ఇలా పలువురి సమష్టి కృషి అవగాహన, ఆలోచనల ఫలితంగా రాజ్యాంగం సాకారమైంది. దేశ రాజ్యాంగం నిర్మాణానికి ప్రధానంగా సర్. బెణగళ్ నరసింహారావు చదువు, లోక జ్ఞానం, దీక్ష, కృషి ఆధారం; మూలం.
‘బెణగళ్ నరసింహరావు అంతర్జాతీయ కోర్టులో తొలి భారతీయ న్యాయమూర్తి! (ICJ; 1952-53) కులాతీతంగా నరసింహారావు స్థాయి, స్థితి, ఎదుగుదల అంబేడ్కర్ సాధించగలిగారా? నరసింహరావు న్యాయశాస్త్ర కోవిదుడిగా ప్రపంచ ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా, యూ. ఎన్. సెక్రటరీ జనరల్‌గా సేవలను అందిచారు. రాజ్యాంగం పని పూర్తి అయిన 1950 తరువాత అంబేడ్కర్ జీవితం ఏమిటి? 1956లో మరణించేంత వరకూ అంబేడ్కర్ సఫలమైన సందర్భాలు ఉన్నాయా?
రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏళ్లయింది. ఇవాళ దేశ వ్యతిరేక, సంఘ వ్యతిరేక శక్తులు “మనువాదం, మనుస్మృతి” వంటి పడికట్టు లేదా ఊతపదాలతో చదువు ప్రాసంగికత లేకుండా ఆగం చేస్తున్నట్టుగా “రాజ్యాంగం… రాజ్యాంగం…” అంటూనూ ఆగం చేస్తున్నారు. ఇవాళ రాజ్యాంగం అన్నది కూడా పడికట్టు పదం, ఊత పదం అయిపోయింది.
మన రాజ్యాంగం విషయంగా ప్రతి పౌరుడూ సరైన, సమగ్రమైన అలోచన చెయ్యాలి. మనకు స్వతంత్రం వచ్చాక దేశానికి రాజ్యాంగం కావాలి అనుకున్నాక కొన్ని ఇతర దేశాల రాజ్యాంగాల ఆధారంగానూ అప్పటికే ఉన్న కొన్ని బ్రిటిష్ ప్రభుత్వ విధానాలతోనూ అప్పటి దేశ, కాల అవసరాల కోసమూనూ మనదేశ రాజ్యాంగం ఏర్పడింది. ఇవాళ్టి, రేపటి దేశ, పౌరుల అవసరాలకు, స్థిరతకు అప్పటి ఈ రాజ్యాంగమే పనికొస్తుందా?
కాంగ్రెస్ ప్రభుత్వం 100 సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చింది. 1950 రాజ్యాంగంలోని లేని ఎన్నిటినో తరువాతి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగంలోకి చొప్పించింది. వాటి ప్రభావం వల్ల దేశం ఎంతో నష్టపోయింది కూడా. ఆర్టికల్స్ 25, 28, 30 (1950), HRCE చట్టం (1951),
హెచ్‌సిబి ఎంపిఎల్ (1956), లౌకికవాదం (1975), మైనారిటీ హక్కుల చట్టం (1992), వక్ఫ్ చట్టం (1995), 1992లో ప్రార్థనా స్థలాల చట్టం వంటివి 1950నాటి రాజ్యాంగంలో లేవు. 1954, 1964, 1995, మరియు 2013 సంవత్సరాల్లో, (హిందువుల నుండి భూమిని స్వాధీనం చేసుకోవడానికి) వక్ఫ్ సవరణ చట్టాల వంటివి రాజ్యాంగంలో వచ్చిన అపాయకరమైన మార్పుల్లో కొన్ని.
దేనికైనా మార్పు తప్పనిసరి. మార్పు అన్నది లేకపోవడం దోషం; హానికరం. రాజ్యాంగం కూడా దేశ అవసరాల, పెద్ద శాతం ప్రజ అవసరాల పరంగా పెనుమార్పులకు సిద్ధం అవాలి.
రాజ్యాంగం బండ రాయి కాదు కదా? ఇప్పటి దేశ, కాల పరిస్థితులకు, భవిష్యత్ అవసరాలకు 76యేళ్ల నాటి రాజ్యాంగం ఎంత వరకూ ఉపయుక్తంగా ఉంటుంది? 76యేళ్ల తరువాత కూడా 76యేళ్ల నాటి రాజ్యాంగం మారకూడదా? దేశ గమనానికి రాజ్యాంగం మార్పులు అత్యవసరం కాదా?
పాత రాజ్యాంగం స్థానంలోకి కొత్త రాజ్యాంగం రావలసిన అవసరం లేదా? దేశం, ప్రపంచం, ప్రజ మారుతోంది కదా? జీవన విధానాలు, ప్రమాణాలు మారుతున్నాయి కదా? రాజ్యాంగం కూడా మారాల్సిన అవసరం లేదా? 1950 నాటి రాజ్యాంగం 2050 నాటికి, 2150 నాటికి కూడా సమూలమైన మార్పులు లేకుండా కొనసాగడం సరైనదే అవుతుందా? ఆలోచిద్దాం…
దేశ రాజ్యాంగం దేశ అవసరాలకు, నిర్వహణకు, భద్రతకు, పురోగతికి, పౌరుల సంక్షేమానికి, రక్షణకు ఉద్దేశించినది. రాజ్యాంగం అన్నది “రాజ్యాంగం… రాజ్యాంగం…” అంటూ ఆగం చేస్తున్న దేశ, జన వ్యతిరేక శక్తులు, విదేశీ మతాల మాఫియాలు, కులోన్మాదంతో సగటు పౌరుడికి హాని చేస్తున్న దుష్టశక్తులు, హిందూ విద్వేషవాదులు, హిందూ ప్రజ వినాశకర శక్తులకు రక్షణ కవచం కాకూడదు.
‘దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం వచ్చేసింది’ అని తెలుసుకోవాల్సిన కాలం కాదా ఇది? ఇన్నాళ్లలా కాకుండా ఇకనైనా దేశంలోని పెద్ద శాతం ప్రజలైన హిందువుల భద్రతకు, హిందువుల భవిష్యత్తుకు, హిందువుల జీవనాలకు, హిందువుల ఆస్తులకు భరోసా ఇచ్చే కొత్త రాజ్యాంగం అవసరం లేదా?
దేశాన్ని దెబ్బకొడుతున్న విదేశీ మతాల మాఫియాలను సమూలంగా నిర్మూలించే కొత్త రాజ్యాంగం అవసరం లేదా? దేశంలో కుల ఆరాచకాలను తొలగించే కొత్త రాజ్యాంగం అవసరం లేదా? విదేశీ మతాలకు, కుట్రలకు బలవ్వని దేశ భవిష్యత్ కోసం కొత్త రాజ్యాంగం అవసరం లేదా? భారతీయతను పరిరక్షించే, సుస్థిరపరిచే కొత్త రాజ్యాంగం అవసరం లేదా?
‘విదేశీ మత సంతుష్టీకరణ, కుల సంతుష్టీకరణ దేశ సంతుష్టీకరణను ఇవ్వవు’. కులాల వారీగా, మతాల వారీగా చట్టాలున్న దేశంగా కాదు… దేశ పౌరులందరూ రాజ్యాంగం పరంగా సమానంగా ధైర్యంగా దేశంలో మనుగడ చెయ్యగలిగే రాజ్యాంగ దేశం కదా మనకు కావలసింది?
దేశంలోని బాధ్యతాయుతమైన పౌరుల సహకారంతో మనదేశ కేంద్ర ప్రజా ప్రభుత్వం దేశ సుస్థిరత, మతాతీత ప్రగతి, కులాతీత అభివృద్ధి, హిందూ జన రక్షణ కోసం కొత్త రాజ్యాంగం ఆలోచన చెయ్యాలి; కొత్త రాజ్యాంగం నిర్మాణం దిశగా కేంద్ర ప్రజా ప్రభుత్వం సరైన అడుగులు వేయాలి.
– రోచిష్మాన్
9444012279