దాదాపు 400 ఏళ్లుగా వార్తాపత్రికలు సమాచారానికి సమగ్ర వనరులుగా ఉన్నాయి. అయితే వాటి చరిత్ర రోమన్ సామ్రాజ్యంలో 59BC నాటిది. రోమ్ ఒక వ్యూహాత్మక నగరం మాత్రమే కాదు, ఆవిష్కరణలకు కూడా కేంద్రంగా ఉంది.
రోమన్లు సైనిక ప్రచారాలు, మరణశిక్షలు, పోటీలు మరియు రాజకీయాల గురించి వార్తలని లోహం లేదా రాతి పలకలపై చెక్కేవారు.ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కరణతో వార్తా పత్రికల ప్రచురణ ఊపందుకుంది భారతదేశంలో, మొదటి వార్తాపత్రిక 1780లో ప్రచురించబడింది.
ప్రారంభంలో వార్తాపత్రికలు ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉండేవి.అదే విధంగా ఇవి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు.అయితే, సంవత్సరాలుగా, ప్రింటింగ్ ప్రెస్ వేగవంతమైన మార్పులకు గురైంది, ఇది వార్తాపత్రికల ముద్రణను దెబ్బతీసింది. దీనితో తక్కువ ఖర్చుతో వీటిని ముద్రించాల్సి వచ్చింది.
ప్రస్తుత కాలంలో డిజిటల్ విప్లవం వచ్చినప్పటికీ వార్తా పత్రికలు ఇంకా ఆదరణ పొందుతూనే వున్నాయి.ఇవి ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య అనుసంధానకర్తలుగా వుంటున్నాయి.వివిధ సమస్యలని ఇవి ప్రభుత్వాల దృష్టికి తీసుకు వస్తుంటాయి.
భారతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని జనవరి 29, 1780న మొదటి భారతీయ వార్తాపత్రిక ‘హికీస్ బెంగాల్ గెజెట్’, స్థాపించిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ పత్రికని’కలకత్తా జనరల్ అడ్వర్టైజర్’ అని కూడా పిలుస్తారు, ఇది మొదటి వారపత్రిక. ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ప్రకారం, ప్రతి సంవత్సరం జనవరి 29న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద వార్తాపత్రిక మార్కెట్‌ను కలిగి ఉంది, భారతదేశంలోని 22 షెడ్యూల్డ్ భాషలలో మరియు దేశవ్యాప్తంగా మాట్లాడే అనేక ఇతర భాషలలో ప్రచురణలు ఉన్నాయి . హిందీ భాషా వార్తాపత్రికలు అత్యధికంగా సర్క్యులేషన్ కలిగి ఉన్నాయి, ఆ తర్వాత ఇంగ్లీష్ మరియు తెలుగు ఉన్నాయి.
కరోనా కాలంలో అన్ని రంగాలు దెబ్బతిన్నట్లే పత్రికా రంగం కూడా దెబ్బతింది.చాలా పత్రికలు వివిధ పార్టీల అవసరాల నిమిత్తం పనిచేస్తున్నప్పటికీ,కొన్ని పత్రికలు ఇంకా విలువలు పాటిస్తూనే వున్నాయి.
– యం.రాం ప్రదీప్
జెవివి సభ్యులు,తిరువూరు
9492712836
(జనవరి 29- భారతీయ వార్తా పత్రికల దినోత్సవం)