– ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రావలసిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలవడం తీవ్ర శోచనీయం.ఇది రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట,సిట్ విచారణ టీవీ సీరియల్స్ ను తలపిస్తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారంలో పాలకులు ఘోరంగా విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
అవినీతిలో కూరుకుపోయి, కుంభకోణాల మయం అయిన రేవంత్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో ఉంది.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక పదేళ్ల తన సుపరిపాలనలో గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ పై చేస్తున్న దుర్మార్గ ప్రచారంలో భాగమే ఈ నోటీసులు. తెలంగాణ యావత్ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్ ను టార్గెట్ చేసి ఎలాంటి సంబంధం లేని కేసులో విచారించాలనే కుట్ర దుర్మార్గం.ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి తమ పార్టీ నాయకులపై విచారణల పేరిట దాడులకు దిగడం తీవ్ర ఆక్షేపణీయం