– తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డిది ద్రోహ పాత్ర
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: హార్వర్డ్ పోయినా అసలు బుద్ది మారలేదు. కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలకు ప్రజలే బుద్దిచెబుతారు. రేవంత్ రెడ్డి ఎంత గింజుకున్నా దానిని చెరపలేడు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డిది ద్రోహ పాత్ర. బూతులు, కూతలతో కేసీఆర్ చరిత్రను చెరపగలనని రేవంత్ భావిస్తున్నాడు.
అబద్ధాలతో రేవంత్ చేసిన ద్రోహాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఆరునూరైనా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అది గుర్తించే రేవంత్ అవాకులు, చెవాకులు పేలుతున్నాడు. ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు.