– రాష్ట్రంలో జంగిల్‌రాజ్
– అంబటి రాంబాబు హత్యకు ప్రయత్నించారు
– కేవలం దురుద్దేశంతోనే తిరుమల నెయ్యిపై ఆరోపణ
– అదంతా అవాస్తవమని తేల్చిన ల్యాబ్‌లు. సీబీఐ
– వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు?
– వారు ఒకవేళ తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు?
– సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ అని చెప్పి మోసం చేశారు
– ఆ ఫ్లెక్సీలు మేము పెడితే ఊర్కుంటారా చంద్రబాబు?
– ఇప్పుడు తప్పు చేసిన ఎవ్వరినీ వదిలి పెట్టబోము
– వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా బదులిస్తాం
– అన్నీ ఎంక్వైరీ చేయిస్తాము. కోర్టు బోను ఎక్కిస్తాము
– ఈరోజు మీరు దారుణ విష బీజాలు నాటుతున్నారు
– అవి రేపు వృక్షాలవుతాయి.. మీ అధికారం శాశ్వతం కాదు
– అంబటి రాంబాబు భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్. విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనుమానం కలుగుతుంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.
రాష్ట్రంలో జంగిల్‌రాజ్ కొనసాగుతోందని, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అ«ధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజాస్వామాన్ని దారుణంగా ఖూనీ చేస్తున్న సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని దురుద్దేశంతో దుష్ప్రచారం చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్‌కళ్యాణ్ ఆరోపణలు, విమర్శల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మకమైన ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) స్పష్టమైన నివేదికలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. అదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చిందని చెప్పారు.
దేవుడి పేరుతో రాజకీయం చేశామని, తప్పు ఒప్పుకుంటూ క్షమాపణ కోరాల్సిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్‌కళ్యాణ్ ఎదురుదాడి చేస్తున్నారని వైయస్ జగన్ తెలిపారు. పచ్చి అబద్ధాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ప్రస్తావించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా చేసిన మోసాన్ని చెబుతూ, తామూ అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఊర్కుంటారా అని ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నిస్తే ఇలా దాడులు చేయడం అత్యంత హేయమని అభివర్ణించారు. తాము అధికారంలోకి వచ్చాక, ఇప్పుడు తప్పు చేసిన, చేస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోమని, విచారణ జరిపిస్తామని, కోర్టు బోను ఎక్కిస్తామని గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఈరోజు జంగిల్‌రాజ్ కొనసాగుతోంది. అది ఏ స్థాయిలో ఉంది అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతోంది.
చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దాదాపు ఏడాదిన్నర నుంచి కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా కావాలని, కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేపనూనె కలిసింది అంటూ రకరకాలుగా చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు, చంద్రబాబుతో కలిసి ఉన్న పవన్‌కల్యాణ్.. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా, దేవుడంటే కనీసం భయం, భక్తీ లేకుండా రాజకీయాల కోసం దేవుణ్ని ఉపయోగించడం మొదలు పెట్టారు.
అయితే ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని ఏకంగా ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు), ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) రిపోర్టు ఇచ్చాయి. ఆ రెండూ కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. వీళ్ల హయాంలో, వీళ్లు ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు. అవి టెస్ట్ శాంపిళ్లు కూడా. వాటిని అనాలసిస్ చేసి వాళ్లు సీబీఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇంకొకటి కానీ ఏవీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ సిట్ తన ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చి, అవే ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్లు కూడా జత చేసి, క్లోజర్ ఇచ్చింది.
నేను అడుగుతున్నాను. ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు?. వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టి, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పు జరగలేదు కాబట్టి, వారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో పెట్టలేదు. అరెస్టు కూడా చేయలేదు.
అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎందుకొచ్చింది? వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తప్పు.. వీటి మీద విచారణ చేయండి అని పిటిషన్ వేశారు కాబట్టి. దానిపై స్పందించిన సుప్రీంకోర్డు సీబీఐ చేత విచారణకు ఆదేశించింది.
తిట్టినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఉదయం జరిగిన విషయమంతా వివరించి.. అంత మంది తన మీద పడి బండబూతులు తిట్టడంతో, తాను అలా తిట్టాల్సి వచ్చిందని చెబుతూ.. ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు.
అంటే తన మీద దాడి జరుగుతున్నా, తనను ఒకవైపు తిడుతున్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన రెండు తిట్లు తిట్టినందుకు ఇంటికొచ్చి బాధపడి ప్రెస్‌మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దానికి వివరణ ఇస్తూ.. అప్పుడు నేను తిట్టకుండా ఉంటే బాగుండేది. అయినా దానికి నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా మాట్లాడారు.
ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కొడుక్కి, ఆయనకి కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.
రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలన్నింటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ కూడా బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో సహా వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కర్నీ హెచ్చరిస్తున్నాను.
రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. లేదంటే రేపొద్దున్న ఈ విషపు విత్తనాల కారణంగా, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైయస్సార్సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.