– 11 తేదీలోగా రైతు బంధు ఇవ్వకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు ఇడుస్తారు
– నిన్ను చీర్చి చింత కడతారు..
– గెలిచే దమ్ములేక మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు
– వడ్డీతో సహా చెల్లిస్తాం గుర్తుపెట్టుకోండి
– పీసీసీ పదవిని 50 కోట్లకు కొన్న చరిత్ర నీది
– కేసీఆర్ తెచ్చిన తెలంగాణ లేకపోతే.. ఆంధ్రా మోచేతి నీళ్లు తాగేవాడివి రేవంత్ రెడ్డి
– రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
మెదక్: కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక, ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలు మారుస్తున్నారని మాజీ మంత్రి, హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై, పాలనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని అడుగుతున్నా. అవ్వతాతలు రూ. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా?
బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా.. ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ. 2500 అడిగితే ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం సాగదు ఖబర్దార్. తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్.
కెసిఆర్ చెబితే మేము కూడా పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి నువ్వు? రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ పంపిన దొంగవు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహివి. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చారు కాబట్టే నువ్వు ఈరోజు సీఎం కుర్చీలో ఉన్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ, బ్యాగులు మోసుకుంటూ బతికేవాడివి.
కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా ఉంటే మా అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? జనం మీకు ఓటు వేయరని అర్థమై.. పోలీసులతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కండువాలు కప్పుతున్నారు. ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకుపోతున్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటాం. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం.
ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడకపోతే.. రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. నిన్ను చీరిచింతకు చెండాడుతారు. రుణమాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడివి నువ్వు. నీ అబద్ధాలను రైతులు నమ్మే స్థితిలో లేరు.
మెదక్ జిల్లా కల నెరవేర్చింది కేసీఆర్. ఇక్కడికి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, రైలు, నాలుగు లైన్ల రోడ్డు తెచ్చింది కేసీఆర్. ఘనపూర్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది మేము. సిద్దిపేటతో సమానంగా మెదక్‌ను అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ వచ్చాక ఇక్కడ ఒక్క రూపాయి పని జరగలేదు. మెదక్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు.
ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు మీ హరీష్ అన్న ఉన్నాడు. నేను చూసుకుంటా. కాంగ్రెస్ గుండా రాజకీయాన్ని, మోసాలను ఎండగట్టండి.బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చారు. కాబట్టి కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మెదక్ అభివృద్ధిని కొనసాగిద్దాం.