– ముఖ్యమంత్రి భాష పై ఎన్నికలు సంఘం ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు?
– అరాచకాలు జరుగుతుంటే ఈసీ, పోలీసులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా?
– రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి
– ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ నిబద్ధత లేకుండా పోయింది. ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు నిరంకుశంగా జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు అత్యంత దుర్మార్గంగా హేయమైన రీతిలో జరుగుతున్నాయి..వీటిని ప్రహసనంగా మార్చేశారు
పాలకపక్షం విచ్చల విడిగా డబ్బులు పంచుతుంటే ఎన్నికల సంఘం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. ఎన్నికల సంఘం , పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే బిఆర్ఎస్ పైన దాడులకు తెగబడుతున్నారు.
మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన దాడి. చేశారు.ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము..మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును మంచిర్యాల జిల్లాలో ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, ఎన్నికలు సజావుగా జరిగేలా కనిపించడం లేదు.
ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడం ఎందుకు ..అంతటా అధికార పక్షం కాంగ్రెస్ గెలిచిందని సర్టిఫికెట్ ఇస్తే పోలా ?
కోదాడలో మా పార్టీ అభ్యర్థి మామిడి దివ్యను కిడ్నాప్ చేశారు. అక్కడ బీ ఆర్ ఎస్ హిందూ అభ్యర్థిని ని బురఖా కప్పి లోపలికి తీసుకెళ్లి విత్ డ్రా చేయించి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికను ఏక గ్రీవం చేశారు స్పీకర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి కాంగ్రెస్ కండువాలు కప్పారు. కంచె చేను మేసినట్లుగా కనిపిస్తుంది.
అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది.. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా చొరవ తీసుకోవాలి. ఎలుక తోలు ఎంత రుద్దిన నలుపు నలుపే అన్నట్లు , రేవంత్ రెడ్డి భాష మాత్రం మారడంలేదు.
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పైన రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ముఖ్యమంత్రి భాష పై ఎన్నికలు సంఘం ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? ఇంత జరుగుతున్న ఎన్నికల సంఘం, పోలీసులు గుడ్డి గుర్రం పళ్ళు తొమినట్లు వ్యవహరిస్తున్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అరెకపూడి గాంధీ ప్రజల దృష్టిలో పార్టీ మారిన , స్పీకర్ దృష్టిలో పార్టీ మారలేదు.ఆయనను నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ గా నియమించారు.
డిఫెక్షన్ పిటిషన్ లో ఎమ్మెల్యే గాంధీ పార్టీ మారలేదని చెప్పి, ఇప్పుడు కాంగ్రెస్ ఇంచార్జ్ లుగా నియమించారు రాజకీయ వ్యభిచారానికి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడు.
బుట్టంగారి మాధవ రెడ్డికి బిఆర్ఎస్ టికెట్ ఇవ్వడం పై స్పందించిన ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్.
బుట్టంగారి మాధవ రెడ్డికి టికెట్ అంశం పార్టీ దృష్టికి తీసుకెళ్లాము..పార్టీ అధిష్టానం దీని పైన సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుంది. BC లకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకునేదే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పై ఎన్ని డ్రామాలు ఆడారు ? రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా కు బీసీ సంఘాలు పిలుపు నిస్తే పాల్గొనే మొదటి వ్యక్తి ని నేనే. కొందరు రాజకీయాల కోసం మాట్లాడుతున్న మాటలను పట్టించుకోవాల్సిన పని లేదు . ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు రాఘవేంద్ర యాదవ్ , బొమ్మెర రామమూర్తి పాల్గొన్నారు.