– ఇచ్చిన ఉద్యోగాల కోసం కేసీఆర్ దాకా ఎందుకు ?
– అశోక్ నగర్ లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులే లెక్కకట్టి చెబుతారు
– ఆ తర్వాత రేవంత్ రెడ్డి తల నరుక్కుంటాడా ?.. నిరుద్యోగులతో నరికించుకుంటాడా ?
– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ? పెట్టిన పరీక్షలు ఎన్ని ?
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఉరి తీసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ? పెట్టిన పరీక్షలు ఎన్ని ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల కోసం కేసీఆర్ దాకా ఎందుకు ? అశోక్ నగర్ లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులే లెక్కకట్టి చెబుతారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి తల నరుక్కుంటాడా ? నిరుద్యోగులతో నరికించుకుంటాడా ? అతని కర్మ
ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు అంటున్నారు అని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి అని నిరుద్యోగులు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తుంటే, అశోక్ నగర్లో నిలదీస్తుంటే పోలీసులతో లాఠీచార్జి చేయించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓడియన్ మాల్ ఓపెనింగ్ వెళ్లడానికి అడ్డుకుంటారని రేవంత్ రెడ్డి నిరుద్యోగుల మీద పోలీసులతో నిర్భంధం ప్రయోగించారు. రేవంత్ రెడ్డి అబద్దాలు, అభాండాలు, అడ్డగోలు కూతలే రాజకీయ జీవితానికి యమపాశాలై మెడకు చుట్టుకుంటాయి
రేవంత్ రెడ్డికి దేశ ప్రధానమంత్రి ఎవరో తెలియదు. నల్లమల ఏ బేసిన్లో ఉందో తెలియదు. దాశరధి ఎక్కడ పుట్టారో తెలియదు. అలాంటి దీనస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఆమూలాగ్రం మీద అవగాహన ఉన్న కేసీఆర్ గారికి సవాల్ విసరడం హాస్యాస్పదం
హామీల అమలు చేతగాక ప్రతి సభలో కేసీఆర్ గారి మీద నోరు పారేసుకుంటూ రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. యూరియా లేక రైతులు అల్లాడిపోతున్నారు.రైతుభరోసా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.