– రెడ్లను పొగిడిన రేవంత్ బీసీల గురించి మాట్లాడుడేంది?
– రెడ్లకు మాత్రమే రాజ్యమేలే అర్హత ఉందని అప్పుడు అనలేదా?
– ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం బీసీల జపం చేయడం సిగ్గుచేటు
– కవిత అరెస్టు కావడానికి రేవంత్ రెడ్డి బాధపడిన విషయం వాస్తవం కాదా?
– బొంద అనే పదం కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది
– కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయం
– బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు
హైదరాబాద్: కెసిఆర్ కుటుంబంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లాలన్న ఉత్సాహం చాలా ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఈ మధ్యకాలంలో పార్లమెంటులో రాహుల్ గాంధీ దేశ భద్రత విషయంలో దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడడాన్ని బిఆర్ఎస్ అనాధికార పత్రికలో ప్రముఖంగా ప్రచురించి ఆ పత్రిక ద్వారా బిఆర్ఎస్ పార్టీ తన వాత్సల్యాన్ని ప్రకటించుకున్నది.
గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం నీతి నిజాయితీతో పేద బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు నడుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అందులో ప్రధానంగా నీ కుట్రలో మార్ఫింగ్ చేసి దేశ ప్రజలను మభ్య పెట్టాలని చూసినా దేశ ప్రజలు నమ్మకుండా భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని విశ్వసించి మూడవసారి ప్రధానమంత్రిని చేశారు.
లిక్కర్ మాఫియాలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా ఉన్నారని విషయంతో దానికి ప్రధాన పాత్ర పోషించిన అప్పటి టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి జైలుకు పంపించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ ది నరేంద్ర మోడీ ప్రభుత్వానిది.
కల్వకుంట్ల కవిత అరెస్టు చేయడానికి జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ లబ్ధి కోసం కవిత ను అరెస్టు చేశారని మాట్లాడిన విషయం వాస్తవం కాదా? కవిత అరెస్టు కావడానికి రేవంత్ రెడ్డి బాధపడిన విషయం వాస్తవం కాదా? ఇది ప్రచార మాధ్యమాలలో వచ్చిన విషయమే.
నేడు టెలిఫోన్ టాపింగ్ కేసులో ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నావో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసులో నిన్ను కేసీఆర్ కుటుంబం కాపాడినందుకు వారి రుణాన్ని తీర్చుకోవడానికి, నేడు వారిని అరెస్టు చేయకపోవడం వాస్తవం కాదా? చేతనైతే సాక్షులుగా పిలవడం కాదు. నిందితులుగా పిలిచి విచారణ చేపట్టాలి.
నిజామాబాద్ సభలో నిజామాబాద్ సభలో ఒక్కొక్క కులాన్ని తన పేరు వెనక పెట్టుకొని బడుగు బలహీన వర్గాల ఓట్లు పొందడానికి ఆడుకున్న నాటకాన్ని తెలంగాణ ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారు. రెడ్డిలకు మాత్రమే పరిపాలించే అర్హత ఉందని గతంలో మాట్లాడిన మీకు మీ పేరు వెనుక యాదవ్, ముదిరాజ్, మాదిగ పెట్టుకున్నంత మాత్రాన ఆ వర్గాలు రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదనేది వాస్తవం.
తాత్కాలిక ప్రయోజనాల కోసం నిమ్న వర్గాలను బలహీన వర్గాలను వారి కులాల గురించి మాట్లాడినా రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.మీ పార్టీ నాయకులకు ఎంపి పదవి, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ఆ వర్గాలన్నీ రేవంత్ రెడ్డిని సమర్తిస్తారని భావించుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేకమే.
బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీ ఫెవికాల్ బంధం, Feviquik గురించి ఆయన రాజకీయాలకు రాక ముందు నుంచి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి.. బహిరంగ సభలో ఉచ్చరించకూడని పదాలను ఉచ్చరించి తన స్థాయిని తగ్గించుకున్నారు. బొంద అనే పదం కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయం.
ముఖ్యమంత్రి కలలు కంటూ ఇంకా ఎనిమిది సంవత్సరాలు తన అధికారంలో ఉంటాను అని మాట్లాడుతున్నారు. నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచిన విషయం మర్చిపోయావా? ఆ సీటు కాంగ్రెస్ పార్టీది అన్న విషయమైనా రేవంత్ రెడ్డికి తెలుసా?
భారతీయ జనతా పార్టీని నిజామాబాద్ కరీంనగర్ మెదక్ అదిలాబాద్ ప్రజలు ఆదరించారు. వచ్చే మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఆదరిస్తారని నమ్మకం విశ్వాసం భారతీయ జనతా పార్టీకి ఉంది
విమానాశ్రయాలను గురించి మాట్లాడడం, వాటిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం మరిచిపోయి మరోసారి మోసం చేసే మాటలను రేవంత్ రెడ్డి మాట్లాడారు. రీజినల్ రింగ్ రోడ్ అనుమతులు ఎప్పుడొచ్చాయో తెలియకుండా, నేను చేశాను అని చెప్పడం ముఖ్యమంత్రి దివాలా కోరుతనాన్ని సూచిస్తుంది.
పచ్చి అబద్దాలతో మోసాలతో కుట్రలతో మార్ఫింగ్ లాంటి చేసి ప్రజలు మోసం చేసే రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుతున్నాం.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కల్వకుంట్ల కిషన్ రావు అనే మాట్లాడడం అసహనాన్ని తెలియజేస్తున్నది.
ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలలో అదేవిధంగా గ్రామపంచాయతీ ఎన్నికలలో ఏ విధంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించి విజయాలను అందించారో అదేవిధంగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయాన్ని అందిస్తారన్న విశ్వాసం భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉంది.
పతనమవుతున్న బిఆర్ఎస్ పార్టీ కి ప్రజలు ఆదరించే స్థితిలో లేరు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వారిద్దరి feviquik ఫెవికాల్ బంధంతో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే కుట్ర చేస్తున్నారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజల నుంచి చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి కూడా స్పందన లేకపోవడంతో అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడం కాంగ్రెస్ పార్టీ అద్వాన స్థితిని తెలియజేస్తున్నది.