– ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం?
– సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్తో తొలగిన అడ్డంకి
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటోలు ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకూ సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఒక్కటి మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండగా, ఇకపై ఉప ముఖ్యమంత్రి భట్టి ఫొటో కూడా ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై క్యాబినెట్లో చర్చించనున్నట్లు చెబుతున్నారు.
ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడంపై అభ్యంతరం వేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసి, డిప్యూటీ సీఎం ఫొటో ఉంటే మీకేమిటి నష్టం అని పిటిషనరును ప్రశ్నించింది. దీనికి సంబంధించి న్యాయపరమైన సమస్యలు లేనందున, తెలంగాణలో కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి ఫొటో పెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.