చిన్నప్పుడు మనం స్కూలుకు ఆలస్యంగా వెళ్లినా.. క్లాసులో గొడవ చేసినా.. హోంవర్కు చేయకపోయినా, టీచర్లు మనతో గోడ కుర్చీ వేయించేవాళ్లు గుర్తుందా? అంతసేపు గోడ కుర్చీ వేస్తే బిడ్డ అల్లాడిపోయేవాడు. ఇప్పటి తరం పిల్లలకు ఆ తీపి బాధ తెలియకపోవచ్చు. తీపి గుర్తులూ ఉండకపోవచ్చు. కానీ ఆ గోడ కుర్చీ వల్ల ఆరోగ్యపరమైన ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుకుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.
జిమ్‌కి వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‌తో ఫిట్‌గా ఉండండి. గోడకు ఆనుకుని కుర్చీలో కూర్చున్నట్లుగా చేసే ఈ చిన్న వ్యాయామం.. మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్రయోజనాలు :
పొట్ట తగ్గుతుంది :బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో తోడ్పడుతుంది.
కాళ్ల బలం : కాళ్లు, మోకాళ్లు మరియు నడుము దృఢంగా మారుతాయి.
సరైన భంగిమ : మీ బాడీ పోశ్చర్ (Posture) మెరుగుపడుతుంది.
స్టామినా : శారీరక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతాయి.
రిలాక్సేషన్ : ఒత్తిడి తగ్గి మూడ్ ఉల్లాసంగా ఉంటుంది.
ఈరోజే మొదలుపెట్టండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!