– కృష్ణశాస్త్రి షెలి కన్నా గొప్ప కవి!
తెలుగులోని ఉదాత్తమైన కవుల్లో ఒకరు దేవులపల్లి కృష్ణశాస్త్రి.
కృష్ణశాస్త్రిని ఆంధ్ర షెల్లీ అనడం తప్పు. దేవులపల్లి కృష్ణశాస్త్రి షెలి (p.b. Shelly) కన్నా గొప్ప కవి! తెలుగువారు కృష్ణశాస్త్రిని ఆంధ్ర షెల్లీ అనడం మానుకోవాలి. పీ.బీ. షెలి (షెల్లీ కాదు) ప్రభావం కృష్ణశాస్త్రిపై ఉంది; అది నిజం. కానీ షెలి కన్నా కృష్ణశాస్త్రి ఎంతో గొప్ప కవి. ఈ నిజాన్ని తెలుగువాళ్లం మనం ఇకనుంచైనా గట్టిగా తెలుసుకోవాలి; గట్టిగా చెప్పుకోవాలి.
పదాలకు రంగు,రుచి ఉన్నాయన్న సత్యాన్ని ఎఱిగిన వారు కృష్ణశాస్త్రి.
రవీంద్రనాథ్ ఠాగోర్ “జనగణమన…” పాటకన్నా “జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి…” అంటూ కృష్ణశాస్త్రి గొప్పగా రాశారు.
గజళ్లు రాయకపోయినా,
“ఇలా ఎదురు చూసీ, చూసీ ఎడదపగులునేమో? నొగులు మిగులునేమో?” అంటూ సీ. నారాయణరెడ్డి గజళ్లు అంటూ రాయలేకపోయిన గజలియత్ ను రాశారు కృష్ణశాస్త్రి.
“పొదిగి చిరుగాలి నిదుర తెరజారి కదలె కోనేరు నీరు” అన్నారు కృష్ణశాస్త్రి.
కృష్ణశాస్త్రి అన్న వాటిల్లో కొన్ని:
“త్వరపడి వికసించె కమలము
తిరువడి కడ నిడె దళదళము
వివరించె విహంగమ కులము
సవరించి గళము మంగళము”
* * *
” నా యెద త్రుళ్లింత లాడుచుండు; నవ్య భాగీరథీ దివ్యనది విధాన…”
* * *
“తోటకు తోబుట్టువును
ఏటికి నే బిడ్డను
పాట నాకు సైదోడు
పక్షి నాకు తోడు”
* * *
“ఎవ్వరూ నన్ను వినరు, ఎవరూ నా వైపు కనరు,
ఇంత విపణిలో ఎన్ని అంగడులు,
ఇచ్చి పుచ్చుకొను సందడులు” అని రూమీ, ఖలీల్ జిబ్రాన్ ల స్థాయిలో నిలిచారు కృష్ణశాస్త్రి.
కృష్ణశాస్త్రిపై తెలుగు కవి ఉమర్ అలీషాహ్ ప్రభావం ఉంది. ఉమర్ అలీ షాహ్ తో కృష్ణశాస్త్రి దగ్గరగా మెలిగారు. తెలుగు కవిత్వ విమర్శకులు సరిగ్గానూ, సవ్యంగానూ, ‘చదువు’తోనూ ఉండరు కాబట్టి కృష్ణశాస్త్రిపై తెలుగు కవి ఉమర్ అలీషాహ్ ప్రభావం ఉంది అన్న సంగతి పెద్దగా తెలియరాలేదు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎన్నో గొప్పరచనలు చేశారు; ఎంతో చెప్పుకోవచ్చు ఆయన గుఱించి.
తెలుగులో కవిత్వం పేరుతో గత కొన్ని దశాబ్దులుగా ఏదో వికారం చలామణిలో ఉంది. కమ్యూనిజమ్, మత, కుల వాదాల ఉన్మాదం, అజ్ఞానం, ప్రతిభ రాహిత్యం, అశ్లీలం, చవకబాఱుతనం, చదువు లేమి, కుసంస్కారం, బూతు హిందూ-నింద తెలుగు కవితను నాశనం చేశాయి.
శివారెడ్డి, అఫ్సర్, గోపి వంటి వాళ్లు కూడా గొప్ప కవులైపోయిన దుస్థితి తెలుగు కవిత్వంలో వ్యాపించింది. ఈ దుస్థితి నుంచీ, భాష, భావనల పరంగా వికృత స్థితి నుంచీ తెలుగు కవిత విముక్తి అవాల్సిన అవసరం ఉంది. అందుకు కృష్ణశాస్త్రి కవిత్వం ఎంతో అవసరం. కవినామ మానసిక రోగులు కృష్ణశాస్త్రి కవిత్వాన్ని వైద్యంగా తీసుకోవాలి.
కృష్ణశాస్త్రి కవిత్వం తెలుగు మలం కవుల (‘మ’తం, కు’లం’ వికృత స్వభావులు వెరసి మలం కవులు) వికారానికి ఔషధం!
కవి నామ అతి నీచులు స్పృహ, చదువు, సభ్యత లేకుండా తెలుగు కవిత్వంలో ఉచ్చలు పోసేశారు; రానున్న రోజుల్లో వాళ్లు ‘మలం మా ఆహారం’ అంటూ బహిరంగ మల భక్షణ కూడా చేస్తారు! అందుకే మామూలు తెలుగు ప్రజ కవిత్వాన్ని, కవి నామ నీచుల్ని చీదరించుకుని తమను తాము రక్షించుకున్నారు. ఇటీవల ప్రముఖ తెలుగు కవి అఫ్సర్ ప్రముఖ సాహితీ మేధావి మృణాళిని ముఖాముఖి కార్యక్రమాన్ని 13 రోజుల్లో కనీసం 400 మంది కూడా చూడలేదు’ అన్న క్షేత్ర వాస్తవం తెలుగు కవిత్వ ప్రముఖులను ప్రజ ఏ మేరకు ఏవగించుకుంటోందో తెలియజేస్తోంది.
మామూలు తెలుగు వాళ్లకు, మతి పగిలిపోని, మానసిక రోగులు కాని తెలుగు కవిత్వాభిమానులకు కృష్ణశాస్త్రి కవిత్వం ఉపశమనం.
తెలుగు కవిత్వం పునరుద్ధరణకు, పునరుత్థానం అవడానికి అవసరమైన వాటిల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వం కూడా ఒకటి.

9444012279