– రాహుల్ బంధు కాదు, రైతుబంధు వేయండి
– చేతకాని సీఎంను నిలదీస్తాం.. నిగ్గతీస్తాం
– ప్రజా సమస్యలపై తగ్గేదేలే
– అబద్ధపు హామీల చిట్టా విప్పుతాం
– ఇంతవరకు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు.
– మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : శాసనసభ సమావేశాలకు ముందు ఆనవాయితీగా ఎవరి త్యాగాల వల్లనైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, వారి త్యాగాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ ఇవాళ మా పార్టీ యొక్క శాసనసభ పక్షం మొత్తం, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా, సమావేశం సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించి ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరు కాబోతున్నాం.
వాస్తవం ఏమిటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి… 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి క్యాబినెట్ లోనే మరి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేనన్న మాట వాస్తవం.
మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళసై సౌందరరాజన్, గవర్నర్ నోటమ్మట చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తదని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు… ఇది మూడో గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు.
పంటలు నాట్లు వేసేటప్పుడు నిజానికి కేసీఆర్ టైంలో రైతుబంధు పడేది. కానీ ఇవాళ పంటలు కోతలకు వచ్చినా రైతుబంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే ‘రాహుల్ బంధు కాదు, రైతుబంధు వేయండి’, ‘రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్లా’ అని చెప్పి ఈ సభా సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అన్ని వర్గాలకు హామీలిచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.
ఐదేళ్లలో. మరి రెండు బడ్జెట్లు అయిపోయినవి, ఇది మూడో బడ్జెట్. ఈపాటికే 60 వేల కోట్లు పెట్టి ఉండాలి, మరి ఇంతవరకు దానిమీద కూడా స్పష్టత లేదు. ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళితబంధు స్థానంలో, ఇంతవరకు అదీ అతీగతీ లేదు. రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు. ఇతర వర్గాలకు 10 వేల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే ఆరు గ్యారెంటీలకు అయితే మంగళం పాడినట్టే కనబడుతున్నది.
మహిళలు ఎదురుచూస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా… రెండున్నర వేలు 100 రోజుల్లో ఇస్తామన్నారు ఎప్పటినుంచి ఇస్తారని ముసలివాళ్లు ఎదురుచూస్తున్నారు పెద్దమనుషులు… 4 వేల పెన్షన్లు ఎప్పటినుంచి వస్తాయని. రైతులు రైతుభరోసా కోసం, రైతుబంధు కోసం ఎదురుచూస్తా ఉన్నారు. రైతు కూలీలు నెలకి ఇస్తానన్న వెయ్యి రూపాయల కోసం ఎదురుచూస్తా ఉన్నారు. ఆటో అన్నలు ఎదురుచూస్తా ఉన్నారు వెయ్యి రూపాయల కోసం.
ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే గవర్నమెంట్ చెల్లించాలో, వాటి విషయంలో కూడా మొత్తం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ అన్ని విషయాల్లో… ఉద్యోగ జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంతవరకు ఆ క్యాలెండర్ లో మరి కొత్త క్యాలెండర్ ఉందే తప్ప జాబ్స్ అయితే కనబడట్లేదు. ఈ అన్ని విషయాల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో నిలదీస్తాం, నిగ్గదీస్తాం. ఎక్కడ పోతున్నాయి డబ్బులు అని అడుగుతాం.
మరి కేసీఆర్ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మీకు బ్రహ్మాండమైన వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని మీకు అప్పజెపితే, ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఆర్థిక అరాచకం చేస్తా ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ కు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నదంటే దానికి కారణం కచ్చితంగా ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దానిమీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తాం, నిలదీస్తాం