హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తటాకం మధ్య ప్రతిష్ఠించిన బుద్దుని విగ్రహం అన్న ఎన్టీఆర్ గారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. 1985 అక్టోబర్ 2 వ తేది రామగిరి కొండ మీద బుద్ధ విగ్రహం రూపుదిద్దే కార్యక్రమానికి ప్రారంభ ముహూర్తం. నిటారుగా ఉండే కొండ పైకి ఎన్టీఆర్ గారు నడిచి చేరుకున్నారు.
శిలపై తొలిసారిగా ఉలిని తాటించడం,చెక్కడం అన్న ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా జరిగింది.
ఉలిని పట్టుకొని ఒడుపుగా వంచి తలపై సుతారంగా సుత్తితో మోదారు ఎన్టీఆర్. అది గమనిస్తున్న గణపతి స్ధపతి ఎన్టీఆర్ గారికి నమస్కరించి “అయ్య వారు ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న మహాశిల్పిలా ఉలిని చేతపట్టారు” అని మెచ్చుకున్నారు..
ఈ ఫోటో ఆ సందర్భం లోనిది.
ఎన్టీఆర్ గారితో మోత్కుపల్లి నరసింహులు, మాధవ రెడ్డి, జానారెడ్డి లనూ చూడవచ్చు.
మనిషి మనుగడ ఉన్నంత కాలం మీ ఖ్యాతి పదిలం!