రాజమహేంద్రవరం, మార్చి 27: నగరానికి చెందిన రచయిత, తెలంగాణ సీఎల్పి ఉద్యోగి శ్రీపాద శ్రీనివాస్ కు హైదరాబాద్లోని వైద్యుల గ్లోబల్ ట్రస్ట్, వసుంధర విజ్ఞాన వికాస మండలి వివేకానంద స్ఫూర్తి రత్న జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందజేశారు. వృత్తి తో పాటు ప్రవృత్తిగా కవితలు, కధానికలతో అనతి కాలంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ ను వక్తలు అభినందించి సత్కరించారు. రచనా పర్వాన్ని కొనసాగించాలని సూచించారు.
ఈ సందర్బంగా శ్రీనివాస్ ను రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్లిన మిత్ర బృందం, మునిసిపల్ టౌన్ హైస్కూల్ 1987 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు సత్కరించారు. అలాగే హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం అధికారులు వి.గోపీ చందు, ఏ. అవదాని, కార్యవర్ది, సందీప్ కూడా సత్కరించారు.