– జగన్ ఫోటోలతో లబ్ధిదారుల చేతుల్లో ఉన్న ఇళ్ల పట్టాలే దానికి సాక్ష్యం
– 2.5 లక్షల ఇళ్ల పంపిణీ పేరుతో క్రెడిట్ చోరీ
– వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఫైర్
తాడేపల్లి: గడిచిన రెండేళ్ల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోయినా 2.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేస్తున్నట్టు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని, వైయస్సార్సీపీ హయాంలో వైయస్ జగన్ పూర్తిచేసిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తానే పూర్తి చేసినట్టు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నరని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 2.5 లక్షల ఇళ్లు, గతేడాది 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు షో చేశారని, అవన్నీ వైయస్సార్సీపీ హయాంలోనే పూర్తయినట్టు చెప్పారు. వైయస్ జగన్ ఫోటోలతో లబ్ధిదారుల చేతుల్లో ఉన్న ఇళ్ల పట్టాలే దానికి సాక్ష్యమని వివరించారు.
వైయస్సార్సీపీ హయాంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి చేసినట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పిన చంద్రబాబు, రెండేళ్లలో ఒక్కరికైనా ఇచ్చుంటే చూపించాలని కొరుముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు నేటికీ ఒక్క గజం స్థలం పేదలకు ఇవ్వలేదు.
వైయస్సార్సీపీ హయాంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి చేసినట్టు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో కూడా దాదాపు 80 శాతం పూర్తి చేశాం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు కూడా వేసిన దాఖలాలు లేవని కొరుముట్ల శ్రీనివాసులు స్పష్టంచేశారు.