– ఈ స్కూల్స్ లో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య .
– ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, భోజనం
– వంద నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
– ప్రభుత్వ విద్య పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
– బ్లూ కాలర్ ఉద్యోగాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది
ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: నా బ్రెయిన్ చైల్డ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లా ఏవి ఎన్ రెడ్డి స్కూల్ క్యాంపస్ ఉంది. వంద నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. 25 ఎకరాల్లో 5 నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2500 విద్యార్థుల తో 20 వేల కోట్ల తో నిర్మాణం చేస్తున్నాం. రెండో విడతలో మరిన్ని స్కూల్స్ ఏర్పాటు చేస్తాం.
ప్రభుత్వ విద్య పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉంది. ఒక విద్యార్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం లక్షా 8 వేల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఏఐ కారణం గా పెద్దయెత్తున ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఉంది. వైట్ కాలర్ ఉద్యోగాలకు బదులు బ్లూ కాలర్ ఉద్యోగాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నాణ్యమైన సాంకేతిక విద్య ను అందుబాటులోకి తీసుకురావాలి..
1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థులకు సర్టిపికేట్ ఉంటుంది కానీ స్కిల్స్ ఉండటం లేదు. రాష్ట్రం లో ని 26 వేల ప్రభుత్వ స్కూల్స్ లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ విద్య వైఫల్యం పైన అందరూ ఆలోచించాలి.
పేదరికానికి కారణం విద్య లేకపోవడమే. విద్య వల్లనే గుర్తింపు,గౌరవం లభిస్తుంది. ఆరుట్ల మోడల్ స్కూల్ లో నాణ్యమైన విద్య అందుతుంది.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూల్స్ లో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తాం. 2034 లో జరగబోయే ఒలంపిక్స్ లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్స్ తీసుకు రావడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నాం.బాక్సర్ నిక్కత్ జరీన్,క్రికెటర్ సిరాజ్ కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేశాం.