- ఖర్చు 10 లక్షల రూపాయలు
- విజయవాడ మహానాడు నభూతో నభవిష్యత్
తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టిన 1983 వ సవంతరం లో అన్న గారి ఆదేశం మేరకుపార్టీ ప్రధమ సమావేశాలు విజయవాడ లోనిర్వహించడమైనది. కార్యకర్తలలో స్పూర్తి నింపడానికి అభిమానులలో ఉత్సాహం కలుగచేయటానికి ఆనాటి సభకు అన్న గారు ‘మహానాడు ‘అని నామకరణం చేయటం జరిగింది. అన్న గారి నోట నుండి ఆ మాట వచ్చిన వేళా విశేషం ఏమో గాని.. 43 సంవత్సరములు నిర్విఘ్నం గా నిరాటకం గా జరుపుకొనగలగటం విశేషం.
ప్రముఖ దర్శక నిర్మాత తాతినేని ప్రకాశరావు గారు స్వయం గా పాల్గొని ఆర్థికంగా తోడ్పడారు. ఆ సందర్భంగా వారితో పాటుతణుకు వెళ్లి హరిశ్చద్ర ప్రసాద్ గారిని నేను కూడా కలవగలిగాను.ఆ సమయం లో వచ్చిన విరాళములను జాగ్రత్తగా ఖర్చు పెట్టి , మిగిలిన పైకం విజయవాడ పార్టీ తీసుకునేలా ప్రకాశరావు గారు సూచించండం జరిగింది. ఆ కారణంగానే మొత్తము 11 లక్షలు రాగ, అతి జాగ్రత్తగా 10 లక్షలు ఖర్చు పెట్టి మిగిలిన లక్ష రూపాయలు చెక్కు ద్వారా అన్న గారికి ఇవ్వటం జరిగింది.
ఆ సమయం లో నాకు చెప్పిన ప్రకాశరావు గారు లేరు. ఆ విషయాన్ని అన్న గారి దృష్టికి తీసుకువెళ్లగలిగే సాహసం చేయలేకపోయాము.చివరకు అన్న గారికి ఇవ్వటం అంటే, దేముని డిబ్బీలో వేసినట్లేనని నవ్వుకుని సరిపెట్టుకున్నాము. ఐతే తరవాత విజయవాడ అర్బన్ పార్టీ కోశాధికారిగా నన్ను ఎంపిక చేసిన విషయం చిట్టియ్య గారు అన్న గారి దృష్టికి తీసుకు వెళితే ” నమ్మకస్తులకే గదా తాళం చెవి ఇచ్చేది ” అని కితాబు ఇవ్వటం జరిగింది .
జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర అగ్రనాయకులంతా ఒకే వేదికపైకి రావడం ద్వారా ఆ తొలి మహానాడుకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది . జాతీయ నేతలను ఆహ్వానించడం అన్న గారి జాతీయ దృక్పదానికి నిదర్శనం . మే 26 మరియు 27 వ తేదీలలో జరిగిన ప్రధమ మహా సభలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగితే అందులో అన్న గారి కుటీరం ఒక ప్రత్యేక ఆకర్షణ . ఎందరో మహిళలు సయితం అన్న గారి కుటీరాన్ని చూడడానికి వచ్చేవారు .
మే 28 వ తేదీ అన్న గారి జన్మదినం రోజున జాతీయ రహదారి నుండి ఆటో నగర్ వెళ్లే రోడ్ ప్రక్కన మహానాడు పేరిట జరిగిన సభ అద్భుతం . నడి వేసవి కాలంలో అందునా రోహిణి కార్తీ లో 10 లక్షల జనాభా స్వచ్చందంగా తరలి రావడం విశేషం . అప్పటి నుండే ఆ రోడ్ మహానాడు రోడ్ గా ప్రాచుర్యం పొందింది .
అప్పటి “అన్న గారి నోట మహానాడు మాట నేడు అదొక ప్రధాన బాట” అయింది.
ఆ మహానాడు నిర్వహణలో పాల్గొన్న వందల మందిలో నేను ఒక్కడినై కోశాధికారి భాద్యతలు నిర్వహించగలగటం నాకొక అపూర్వ అవకాశం .
- బసవేశ్వర రావు
(అప్పటి ) కోశాధికారి, ఫైనాన్స్ కమిటీ కన్వీనర్