కేవలం సంక్షేమం మాత్రమే చేస్తే ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుంది. కానీ, ఒక కుటుంబానికి శాశ్వతమైన జీవనోపాధిని కల్పించినప్పుడు, వారు సమాజంలో తల ఎత్తుకుని, గౌరవంగా ఇలా జీవించగలుగుతారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. సంక్షేమంతో పాటు సాధికారతను జోడించి, సామాన్యులను యజమానులుగా మారుస్తోంది.
గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన అన్నవరపు సుమలత గారికి ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహాయం కేవలం ఒక వాహనం కాదు, వారి కుటుంబానికి ఒక భరోసా.
* గౌరవప్రదమైన బ్రతుకు: ఎస్.సి. కార్పొరేషన్ సబ్సిడీ మరియు వడ్డీ లేని ఉన్నతి రుణంతో ₹ 3,00,000 విలువైన ఆటో రిక్షాను అందజేయడం జరిగింది.
* ఆర్థిక స్వాలంబన: ప్రభుత్వ సహాయం మరియు స్వల్ప వాటా ధనంతో సొంతంగా ఉపాధి పొందే మార్గాన్ని ప్రభుత్వం సుగమం చేసింది.
గతంలో కేవలం పథకాలకే పరిమితం కాకుండా, నేడు ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడేలా చేయడమే ఈ ప్రభుత్వ మార్క్ పాలన.
“సంక్షేమం ఒక్కటే చేస్తే ఎదురుచూపుల బతుకులు అవుతాయి. ఒక కుటుంబానికి శాశ్వత జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు చేస్తే సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు!!!” అన్న నినాదాన్ని నిజం చేస్తూ పేదరికం లేని సమాజం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.