ఒడిలో చిన్నారి మనవడిని ముద్దు చేస్తూ.. ఆ చిట్టి చేతులతో తుపాకీని తడిమి చూపించారు. తాత. “ఇంటి ఆవరణలో కనిపించిందల్లా ఆడుకొనే బంతి అనుకోకు.. అది మన వృత్తిలో వాడే ఆయుధం” అని ఎన్నో గర్వకారణమైన కథలు ఆ పసివాడు ఇంట్లో విన్నారు.
తెలుసుకునే వయసు వచ్చేసరికి తమది ఫ్యాక్షన్ కుటుంబం అంటున్నారని, అందరూ భయపడుతున్నారని తెలిసి బాధపడాల్సింది పోయి.. అదే గొప్ప అని ఆనందించడం, గర్వపడడం నేర్చుకొన్నారు. . ఆ ఫ్యాక్షన్ ముద్రను పోగొట్టుకోవడం కోసం నాన్న నడిచిన పాదయాత్రనే తనూ ఎంచుకొన్నారు. సీబీఐ కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూనే.. మధ్యలో జనాల్లో నడుస్తూ, నెత్తిన చేతులు పెట్టి, బుగ్గలు నిమురుతూ.. “నాన్న లేని బిడ్డను, ఒక్క ఛాన్స్” అని అడిగారు.
అధికారంలోకి రాగానే సచివాలయాన్ని ప్యాలస్‌కే పరిమితం చేశారు. దరిదాపుల్లో ఎప్పుడూ 144 సెక్షన్. ప్రజాస్వామ్య వ్యవస్థనే నేర సామ్రాజ్యంగా తీర్చిదిద్దే క్రమంలో ప్యాలస్ నుండే పరిపాలన సాగించారు. ఆ పాలన బాధ్యతలను కూడా ఇతరులకు అప్పగించి, తనదైన ‘అధోజగత్తు’ తన్మయత్వంలో మునిగిపోయేవారు. జగన్.
హెలికాప్టర్లలో తిరుగుతూ, పరదాల చాటున దాక్కునే ఆ పాలకుడు, బటన్ నొక్కేందుకే బయటకు కనిపించేవారు. ఆకాశంలో వెళ్తున్నా కింద పచ్చటి చెట్టు కూడా కనిపించకుండా కొట్టేయించా రు. ఏ సమస్య పైన ఎవరు మాట్లాడినా బూతులతో విరుచుకుపడడానికి ఒక ‘సోషల్ మీడియా’ మందను పెట్టుకున్నారు. తను రాకముందే జనం రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించి, బలవంతంగా జనాన్ని సభలకు తోలుకురమ్మని అధికారులను పురమాయించేవారు.
చివరకు అత్యవసర కాలకృత్యాలకు కూడా వెళ్లకుండా గేట్లు పెట్టించి, చుట్టూ కందకాలు త్రవ్వించి ముసలి, ముతక, పిల్లలు, మహిళలు అనే కనికరం లేకుండా హాహాకారాలు పెట్టించేవా రు. నడిరోడ్డులో చేతులు వెనక్కి విరిచికట్టి డాక్టర్లనే పిచ్చోళ్లను చేయడం నుండి, అక్రమ కేసులతో ఎదురు తిరిగిన వారిని జైలు పాలు చేసి ఆనందించారు.
కొంతమంది బడా బాధితులు జగన్‌ను కలవడానికి వస్తే.. వారిని టేబుల్ ముందు కూర్చోబెట్టి, వెనుక బుక్ షెల్ఫ్ నుండి గన్ తీసి స్టైల్‌గా తిప్పుతూ “మనోళ్లతో మాట్లాడుకోండి (సర్దుబాటు చేసుకోండి)” అని పొదుపుగా అనేవారు. ఆ భయంతో పోర్టుల నుండి భూముల వరకు అన్నీ వదులుకొని, “బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు” అని ప్రాణభయంతో ఆస్తులు రాసిచ్చిన వారు ఎందరో!
రాగానే రోజువారీ కోట్ల కొద్దీ నగదు చూడాలని ఆశపడ్డారు. క్షీరసాగర మథనంలో జగన్మోహిని రాక్షసులకు సురాపానం పోసినట్టు, ఇతడు కూడా మద్యం ద్వారానే వేల కోట్లు పోగేయవచ్చని స్కెచ్ వేశారు. దానికి సొంత డబ్బు ఎందుకు అని, విజయసాయి రెడ్డితో అరబిందో వారికి చెప్పించి అప్పు ఇప్పించారు. వేల కోట్లు కళ్లజూడటంతో అహంకారం నెత్తికెక్కింది. “ఎవడూ నా వెంట్రుక కూడా పీకలేడు” అనే అహంకారపు పొరలు కళ్లకు కమ్మాయి.
ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. ఆఖరికి బంధువులను, ప్రజాప్రతినిధులను సైతం చెప్పులు విడిచే చోట పడిగాపులు కాసేలా చేశారు. “వైనాట్ 175” అనే స్క్రిప్ట్ ఇచ్చి చుట్టూ ఉన్న ముఠా అతడిని మభ్యపెట్టింది. ఫలితంగా రాజకీయంగా మట్టికరిచాడు. దశాబ్దాల ఫ్యాక్షన్ వారసత్వాన్ని ప్రజాస్వామ్యానికి అంటుకట్టి, సకల నేరాల శాఖలతో ఒక ‘మహా అవినీతి వృక్షాన్ని’ నిర్మించారు.
తన ఇంటికి తనే పరిచయం చేసిన ‘గొడ్డలి సంస్కృతి’తో సొంత సభ్యులే దూరమయ్యారు. కాలానికి తగ్గట్టు గన్ కల్చర్‌కు మారి అపారంగా సంపాదించారు. . కానీ తన అహంకారంతో ఆ రాజకీయ వృక్షాన్ని కూకటి వేళ్లతో సహా కూల్చుకున్నాడు. తనను నమ్మిన వారిని చట్టానికి దొరికేలా చేసి, ఇప్పుడు పొరుగు రాష్ట్రం నుండి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
రాజధాని ఏదంటే ఐదు కోట్ల జనం నామోషీగా భావిస్తూ బాధపడుతుంటే.. దేశ అత్యున్నత సభలు (పార్లమెంట్) చర్చించాల్సి వచ్చింది. అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చి, రాష్ట్రపతి గెజిట్ ద్వారా మన ఆంధ్రా రాజధాని అమరావతి అని అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది.
అయినా ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదు. తాత తన ఒడిలో నేర్పిన ‘గన్’ పేరునే రాజధానికి సూచిస్తున్నారు. . అది చూసి ఆంధ్రా ఉలిక్కిపడింది. కత్తి, గొడ్డలి, పిస్టల్, గన్, బాంబు పేర్లు ఎందుకు అని సామాన్యులు గడ్డి పడుతున్నారు. అయినా ‘రఫ్ఫా రఫ్ఫా’ అని బాహాటంగా ఫ్లెక్సీలు వేయించి, రక్తపు బలులు ఇస్తూ.. సినిమాల్లోని కాలకేయులను మించి రోడ్ల మీద క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ.. సొంత కార్యకర్తల తలల మీద కారుని పోనిచ్చి, తొక్కించి చంపి.. ఆ ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు.
-చాకిరేవు