చెల్లిని కూడా పెళ్లాం అని చెబితే వైకాపా నాయకులు నమ్ముతారు అని ఆర్కే చెప్పి ఉంటే అది బూతు. కానీ పెళ్లాన్ని కూడా చెల్లి అంటే నమ్మి పెళ్ళి చూపులు చూసే రకం అంటే అది బూతు ఎలా అవుతుంది? అంత నమ్మిన బంటులు అనే పొగడ్త కదా! అలాగే ఇక్కడ మహిళలను ఎక్కడ నిందించారు? ఇందులో జగన్ మోహన్ రెడ్డిని, వారి ఇంట్లో మహిళలు ఏమన్నారు?
వైకాపా నాయకులు మొత్తం పెడబొబ్బలు పెడుతూ దీనిని బూతుగా వక్రీకరిస్తూ, సానుభూతి కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
అమరావతి శాశ్వత రాజధాని అయ్యింది. యావత్తు ఆంధ్రా ఆనందిస్తోంది. పైగా దేశంలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా జగన్ మోహన్ రెడ్డిని ఏవగించుకుంటూ, అమరావతికి మద్దతు ఇచ్చాయి. అదో బాధాకరమైన విషయం అయితే.. పుండు మీద కారం లెక్కన ‘మావిగన్’ అనే డైవర్షన్ తెచ్చి జగన్ జోకర్ అయ్యి విపరీతంగా ట్రోల్ అయ్యాడు.
అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు.. పందిని కూడా నంది అంటే నమ్మే గొర్రెల లెక్కన, ఇందులో బూతు ఉందని వక్రీకరిస్తూ సానుభూతి కోసం పెడబొబ్బలు పెడుతోంది అసలు సిసలైన బూతు మేష్టార్ల పార్టీ.
-చాకిరేవు