అమరావతి గవర్నమెంట్ స్పైన్ ఎందుకు ఒక గేమ్-చేంజర్ అనేది స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం
అమరావతి గవర్నమెంట్ స్పైన్ అంటే ఏమిటి?
అమరావతిలో మొత్తం ప్రభుత్వం —సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, అధికారుల కార్యాలయాలు, నివాసాలు — అన్నీ ఒక సుమారు 1 కిలోమీటర్ వెడల్పు ఉన్న ఏరియాలో ప్లాన్ చేశారు.
ఇది యాదృచ్ఛికంగా కాదు…
“ప్రభుత్వం ఒకే చోట ఉండాలి” అనే స్పష్టమైన డిజైన్ ఫిలాసఫీతో
అంటే…ఒక్కో ఆఫీస్ ఒక్కో మూలలో కాదు, మొత్తం సిస్టమ్ ఒకే లైన్లో పని చేస్తుంది.
హైదరాబాద్‌లో మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్ ఏమిటి?
హైదరాబాద్‌లో ప్రభుత్వ నిర్మాణం ఇలా ఉంది:
సెక్రటేరియట్ ఒకచోట
మంత్రుల ఇళ్లు ఇంకోచోట
హైకోర్టు మరోచోట
జడ్జీలు, అధికారులు నగరం అంతా చెల్లాచెదురు
దీని వల్ల ఏమవుతుంది?
మీటింగ్‌కి వెళ్లాలంటే 1–2 గంటల ప్రయాణం
కాన్వాయ్‌లతో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్‌లు
అధికారుల టైం రోడ్డుపైనే వృథా
డిసిషన్ మేకింగ్ స్లో అవుతుంది
మనం జీతాలు ఇచ్చేది పని చేయడానికి…
కానీ టైం అంతా ట్రాఫిక్‌లోనే పోతే — అది నష్టం ప్రజలకే.
అమరావతిలో డిస్టెన్సెస్ & అడ్వాంటేజ్
ఇక్కడే అసలు డిఫరెన్స్ కనిపిస్తుంది:
మొత్తం ప్రభుత్వం — 5 ప్రధాన బిల్డింగ్స్‌లో
ఒక బిల్డింగ్ నుంచి ఇంకోది — 5 నుంచి 10 నిమిషాలు
IAS ఆఫీసర్ల ఇళ్లు — సెక్రటేరియట్‌కు ~500 మీటర్లు
MLA క్వార్టర్స్ — అసెంబ్లీకి < 1 కిలోమీటర్
NGO ఉద్యోగులు — ~2 కిలోమీటర్ల పరిధిలో
గ్రూప్ ఆఫీసర్లు — ఇంకో అర కిలోమీటర్ దూరంలో
ముఖ్యమంత్రి నివాసం — 1–2 కిలోమీటర్లలో
హైకోర్ట్ జడ్జీలు
ఇళ్ల నుంచి కోర్ట్‌కి మధ్యలో ఒక పార్క్ మాత్రమే — నడుచుకుంటూ వెళ్లే దూరం.
మీటింగ్‌కి వెళ్లాలంటే?
లిఫ్ట్ దిగితే చాలు… పక్క బిల్డింగ్‌కి వెళ్లి మళ్లీ లిఫ్ట్ ఎక్కితే మీటింగ్ హాల్.
గంట పని — 10 నిమిషాల్లో పూర్తవుతుంది
ఆఖరిమాట
ట్రావెల్ టైం తగ్గితే అదే టైం ప్రొడక్టివ్ అవుతుంది
ప్రొడక్టివిటీ పెరిగితే ప్రజల డబ్బు సేవ్ అవుతుంది
అమరావతి ఒక సాధారణ ప్రాజెక్ట్ కాదు… ఇది వచ్చే వందల సంవత్సరాలకి పనిచేసే ఎఫిషియెంట్ గవర్నెన్స్ మోడల్.
“ప్రభుత్వం దగ్గరగా ఉంటేనే వేగంగా పనిచేస్తుంది…అదే అమరావతి గవర్నమెంట్ స్పైన్ అసలు విజన్.”