– మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్
హైదరాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బౌద్ధ నగర్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అను చిత వ్యాఖ్యలు ఖర్గే ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని కోరడమే కాకుండా, ఆ సంస్థను “విషసర్పం”గా సంబోధిస్తూ అత్యంత అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని స్వరూప గౌడ్ అన్నారు.
ఖర్గే మాటలు విద్వేషపూరిత ప్రసంగం (హేట్ స్పీచ్) బహిరంగంగా హింసకు ప్రేరేపించడం కాకపోతే ఇంకేమిటని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం, దశాబ్దాలుగా కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న ప్రమాదకరమైన మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తోందని స్వరూప గౌడ్ అన్నారు సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను ఖర్గే ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు.
ఆర్ఎస్ఎస్పై నిరాధారమైన ఆరోపణలను సమర్థించుకోవడానికి సర్దార్ పటేల్ వారసత్వాన్ని ఉపయోగించలేరని స్పష్టం చేశారు. వాస్తవానికి, మహాత్మా గాంధీ హత్య అనంతరం ఆర్ఎస్ఎస్పై విధించిన నిషేధాన్ని ఎటువంటి ఆధారాలు లేకపోవడంతోనే తర్వాత ఎత్తివేశారని చరిత్ర చెబుతోందని ఆమె పేర్కొన్నారు.