జగ్గయ్యపేట: ఎండలు మండిపోతున్న వేళ ప్రజలకు చల్లని ఉపశమనం కలిగించేందుకు జగ్గయ్యపేట పట్టణంలోని బుద్ధయ్య మెడికల్ షాప్ వద్ద జగ్గయ్యపేట నియోజకవర్గ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని శాసనసభ్యులు & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాటసారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.