– బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ: బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్చా స్వాతంత్రాన్ని సాధించిన పార్టీ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆనాటి సమైక్య పాలకుల అణచివేత నుండి స్వతంత్రం కల్పించిన పార్టీ మన బిఆర్ఎస్. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించింది మన బిఆర్ఎస్ పార్టీ. పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ.
బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణను ఊహించలేము. ఈ అభివృద్ధిని ఊహించలేము. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీకన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పింది గులాబీ జెండా నే. గులాబీ జెండా పుట్టినరోజును రాష్ట్రమంతా ఘనంగా జరుపుకుంటుందన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ఎప్పుడూ ప్రజల పక్షమే అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించాం. 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా.ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి అందించింది బీఆర్ఎస్ పార్టీ.రైతులకు రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను అందించింది బీఆర్ఎస్ పార్టీ.ఇంటింటికి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించింది బీఆర్ఎస్ పార్టీ.కాంగ్రెస్ పార్టీ 420 హామీల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉన్నాం.మహిళలకు 2,500 ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దాని ఊసే ఎత్తలేదు. 4,000 పెన్షన్ అసలే లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడింది. ఆదాయం మందగించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. ఎవరు అవునన్నా కాదన్నా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా, జనగామ, నియోజకవర్గ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ, పాలకుర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.