Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడ డివిజన్‌లో 3. 82 లక్షల డోన్ల వ్యాక్సినేషన్ చేశాం

– ఏపీలో శరవేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 13: గుడివాడ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 3 లక్షల 82 వేల 863 డోసుల వ్యాక్సినేషన్ చేశామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లోని తొమ్మిది మండలాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, స్పెషల్ డ్రైవ్ లపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఈ నెల 11 వ తేదీ వరకు డివిజన్లోని తొమ్మిది మండలాల్లో కొవిషీల్డ్ మొదటి డోసు ఒక లక్షా 74 వేల 595 మందికి, రెండవ డోసు ఒక లక్షా 13 వేల 958 మందికి వేశామన్నారు. అలాగే కొవాక్సిన్ మొదటి డోసు 32 వేల 576 మందికి, రెండవ డోసు 22 వేల 200 మందికి వేయడం జరిగిందన్నారు. ఈ నెల 12 వ తేదీన నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు. కలిదిండి మండలంలో 3 వేల 522 మందికి, మండవల్లి మండలంలో 2 వేల 750 మందికి, గుడివాడ రూరల్ మండలంలో 2 వేల మందికి, గుడ్లవల్లేరు మండలంలో 2 వేల 900 మందికి, నందివాడ మండలంలో 1,940 మందికి, ముదినేపల్లి మండలంలో 3 వేల 398 మందికి, పామర్రు మండలంలో 2 వేల 430 మందికి, పెదపారుపూడి మండలంలో 1,320 మందికి, కైకలూరు మండలంలో 2 వేల 512 మందికి, గుడివాడ పట్టణంలో 3 వేల 760 మందికి వ్యాక్సినేషన్ చేశామన్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డును సొంతం చేసుకుందన్నారు. మూడు కోట్ల డోసుల మైలురాయిని అధిగమించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని డోసులు వస్తే వచ్చే రెండు నెలల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థల సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE