కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం

– డివిజన్ లో 1.93 శాతానికి తగ్గిన పాజిటివిటీ
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 13: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, గుడివాడ డివిజన్‌లో సోమవారం ఒక్కరోజే 415 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్లోని తొమ్మిది మండలాల్లో కోవిడ్ -19 నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ పాజిటివిటీపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలంలో 11 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, వీరిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్నారు. పెదపారుపూడి మండలంలో 59 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకిందన్నారు. కైకలూరు మండలంలో 58 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి వైరస్ సోకిందన్నారు. కలిదిండి మండలంలో 84 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా వైరస్ సోకిందని తెలిపారు. ముదినేపల్లి మండలంలో 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి వైరస్ సోకిందన్నారు.గుడివాడ పట్టణంలో 26 మందికి, పామర్రు మండలంలో 81 మందికి, గుడ్లవల్లేరు మండలంలో ముగ్గురికి, మండవల్లి మండలంలో 15 మందికి, నందివాడ మండలంలో ముగ్గురికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడగా ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని చెప్పారు. డివిజన్లో కరోనా పాజిటివిటీ రేటు 1.93 శాతంగా నమోదైందని తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయన్నారు. ప్రస్తుతం 14 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 10 వేల 494 సచివాలయాల్లో యాక్టివ్ కేసులు జీరో శాతంగా నమోదైందన్నారు. ఇప్పటి వరకు 18 విడతలుగా ఫీవర్ సర్వే జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహనరెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, డీ టైప్ సిలిండర్లను అందుబాటులో ఉండేలా చూస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 108 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైలైన్ పనులు పూర్తయ్యాయన్నారు. 50 కన్నా ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 ఆసుపత్రుల్లో పీఎన్ఏ ప్లాంట్లు వచ్చే అక్టోబర్ 6 వ తేదీ నాటికి ఏర్పాటు కానున్నాయని చెప్పారు. థర్డ్ వేవ్ లో కోవిడ్ నియంత్రణకు సంబంధించి నూతన చికిత్సా విధానాలపై సీఎం జగన్మోహనరెడ్డి దృష్టి సారించారన్నారు. కొత్త మందులు, మెరుగైన ఫలితాలు, తక్కువ దుష్ఫలితాలు ఉన్న వాటి వినియోగంపై దృష్టి పెట్టడంతో పాటు అన్నిరకాలుగా వైద్యులను సిద్ధం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Leave a Reply