– కేవలం 4శాతం ఉన్నవర్గానికే పదవులన్నీ కట్టబెడుతూ, 60శాతమున్న బీసీలను హీనంగా చూస్తున్నాడు
పదవులు పొందిన రెడ్లజాబితా కొండవీటి చాంతాడునే మించిపోతుంది
– టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
రాష్ట్రంలో 4శాతంకూడాలేని తనవర్గంవారికే జగన్మోహన్ రెడ్డి పదవులన్నీ కట్టబెడుతున్నాడని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఇప్పుడుస్పీకర్ గాఉన్న తమ్మినేని సీతారామ్ “రెడ్డివారే తమకు దొడ్డవా రు” అన్నారని, ఆనాడు ఆయనన్న మాటలు నూటికినూరుశాతం నేడు జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్నాడని టీడీపీ రాష్ట్రప్రధానకార్యదర్శి, పార్టీ ఉత్తరాంధ్రప్రాంత ఇన్ ఛార్జ్ బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
సాధారణ గుమాస్తా నుంచి ఐఏఎస్, ఐపీఎస్ సహా, ప్రభుత్వసలహాదారు లు, విశ్వవిద్యాలయ ఉపకులపతులవరకు అన్ని పదవులను జగన్మోహ న్ రెడ్డి తనవర్గంవారికే కట్టబెడుతున్నాడని వెంకన్న తేల్చిచెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రెడ్లప్రదేశ్ గామారుస్తు న్నడన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోఉన్నప్పుడు ఆయనకు లేని కులపిచ్చిని ఆపాదించి, డీఎస్పీలుగా ప్రమోట్ అయినవారిలో తన వర్గంవారే అధికంగాఉన్నారని జగన్ ఆయన బులుగుమీడియా విషప్రచా రంచేసిందన్నారు. చంద్రబాబునాయుడు ఏనాడూ తనవర్గానికి కొమ్ము కాయడమో..లేకవారికి అండగా నిలవడమోచేసింది లేదన్నారు. పదేపదే ఆయన్ని సామాజికవర్గం పేరుతో లక్ష్యంగా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన బులుగుమీడియా అధికారంలోకి రావడానికి నానాయాగీ చేశార ని వెంకన్న ఆగ్రహంవ్యక్తంచేశారు.
అంతటి దుష్ప్రచారం చేసి, అధికారంలో కివచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోకేవలం 4శాతంకూడాలేని తనవర్గాన్నే పెంచిపోషిస్తున్నాడన్నారు.చిన్నచిన్న,పనికిరాని పదవులను ఎస్సీ,ఎస్టీ,బీసీలు,మైనారిటీలకు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి, జిల్లాలను శాసిం చే పదవులు మొదలు,వివిధరకాలపెద్ద పదవులు, పేరు ప్రఖ్యాతులన్న స్థానాలను మాత్రం తనవర్గంవారికి ఇచ్చుకుంటున్నాడన్నారు. ఇదెక్కడి న్యాయమో, ఎలాంటి సామాజికన్యాయమో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని బుద్ధా డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యా క ప్రభుత్వంలోని ముఖ్యమైన పదవులన్నీ తనవర్గంవారికే ధారపోశాడ న్నారు.
ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ గా ఉన్న ఎం.వీ.ఎస్. నాగిరెడ్డి, అగ్రికల్చర్ మిషన్ సభ్యుడిగా పీ.రాఘవరెడ్డి, మరికొందరు సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డిలనే ముఖ్యమంత్రి నియమించా డన్నారు. వారుకాకుండా ఇంజనీర్ ఇన్ ఛీఫ్ ఆఫ్ పంచాయితీరాజ్ శాఖలో రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్షసభ్యుడి గా బీ.శ్రీనివాసరెడ్డి, అదేవిభాగంలో సభ్యులుగా కే.అంజిరెడ్డి, గోపాలరెడ్డి, కల్లం అజయ్ రెడ్డిలను నియమించారన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకమిటీ సమీక్ష సభ్యుడిస్థానంతోపాటు, టీటీడీ ఛైర్మన్ స్థానంలో వై.వీ.సుబ్బారెడ్డి, జేఈవోగా శ్రీదర్ రెడ్డి, నైఫుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా వీ.విజయసాయిరెడ్డి, ఏంఎంసీ ఛైర్మన్ గా చెవిరెడ్డిబాస్కర్ రెడ్డి, టీటీడీ ఎక్స్ అఫీషీయో సభ్యుడుగా జే.మాధవరెడ్డి లు కొనసాగుతున్నారన్నారు. ఏపీ గవర్నర్ ఓడీసీగా వెంకటరెడ్డి, ఏపీఎంఆర్టీ ఛైర్మన్ గా శంకర్ రెడ్డి, ఈ ప్రగతి పేరుతో సుబ్రహ్మణ్యంరెడ్డి , టీజీవీ.ప్రసాదరెడ్డి, ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా పాండురంగారెడ్డి వంటివారు ముఖ్యమంత్రి దయతోనే పదవు లు అనుభవిస్తున్నారని వెంకన్న పేర్కొన్నారు. ఈ విధంగా చెబుతూ పోతే ముఖ్యమంత్రి పదవులిచ్చిన రెడ్ల జాబితా కొండవీటి చాంతాడునే మించిపోతుందని వెంకన్నెఎద్దేవాచేశారు. పైకేమో బీసీల జపంచేస్తున్న జగన్మోహన్ రెడ్డి, పదవుల్ని మాత్రం తనవర్గంవారితోనే నింపేస్తున్నాడ న్నారు.
కేవలం 4శాతమున్న తనవర్గానికే ఇన్నిపదువులిచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో 60శాతమున్న బీసీలకుఎన్నిముఖ్యమైన పద వులిచ్చాడో ఆయనే బహిర్గతంచేయాలని వెంకన్న డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిచూస్తుంటే ఆయనకున్నకులపిచ్చి పీక్స్ కు చేరిందని అర్థమవుతోందన్నారు. తనపార్టీకి సంబంధించిన పదవులను కూడా జగన్, ఆయన వర్గంవారికేఇచ్చాడన్నారు. తనవర్గాన్ని తప్ప, ఇతరవర్గాలను ఈ ముఖ్యమంత్రి నమ్మడంలేదని ఆయనచర్యలే చెబుతు న్నాయన్నారు. ముఖ్యమంత్రి సామాజికన్యాయం పాటిస్తున్నానని గొప్ప లుచెబుతుంటాడని, ఆయన పాటిస్తున్నసామాజిక న్యాయం ఎక్కడుందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేశ్, చంద్రబాబునాయుడి ఇంటిపైకి దాడికొచ్చి, ఆయనవర్గం వారు ఎవరైనా తనతో తలపడాలని సవాల్ విసిరాడని, అతనిలా తాము దిగజారి మాట్లా డటంలేదని వెంకన్నతెలిపారు. టీడీపీలోకూడా రెడ్లకు అధికప్రాధాన్యత ఇస్తున్నామని, వారే జగన్మోహన్ రెడ్డి అవినీతిపై అలుపెరగని పోరాటంచేస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు బీసీలకుఇస్తున్న ప్రాముఖ్యత మరెవరూ ఇప్పటికీఇవ్వలేదని, ఇకముందెన్నడూ ఇవ్వలేరని బుద్దాతేల్చిచెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తనకులపిచ్చిని కంట్రోల్ చేసుకొని, బడుగుబలహీనవర్గాలను గుర్తించి, వారికిన్యాయంచేస్తే సంతోషి స్తామన్నారు. అన్నివర్గాల మద్ధతుతోనేతాను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాననేవాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని వెంకన్న హితవుపలికారు.