– ధూళిపాళ్ల నరేంద్ర న్యాయం గురించి మాట్లాడితే ఆయనకు నోటీసులిప్పించడం అన్యాయం
-టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు
ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల యువత, మహిళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని వారి జీవితాలను తీర్చిద్దిద్దాలనుకుంటే ఈ ప్రభుత్వం వారి ఆశలు, ఆశయాలు అడియాశలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు.
శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు . ఆనాడు నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో సుమారు 2 లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈ రాష్ర్టా్నికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఆ ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తోంది. అంతే కాకుండా త్వరితగతిన ఈ రాష్ట్రాన్ని, 13 జిల్లాల్ని ఒక విజన్ తో అభివృద్ధి చేయాలని చంద్రబాబు అనుకుంటే వైసీపీ ప్రభుత్వం ఆటంకమైంది. అమరావతి రాజధానిని తీర్చిద్దాలని చంద్రబాబునాయుడు కన్న కలలు కల్లలు చేశారు. నేడు తెలుగువాడు కంట నీరు పెడుతున్నాడు. ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా అక్రమదారుల్లో చొరపడుతోంది. ప్రభుత్వం వాటిని అరికట్టలేకపోతోంది.
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యమే ఇందకు కారణం. అఫ్గానిస్తాన్ నుంచి వయా ముంబాయి ద్వారా రాష్ట్రానికి చేరుతున్నట్లుగా ఆధారాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని అడిగినవారిపై ఎదురుదాడి చేయడం, వారిపై కేసులు పెట్టడం వారి పేరున నోటీసులు పంపడం జరుగుతోంది. రాష్ట్ర పరిస్థితుల్ని భయానకంగా, ఆందోళనకరంగా మార్చారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా ఏలుతోంది. మూడుముక్కలాట ఆడుతూ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసే హెరాయిన్ అనే మత్తు పదార్థం గురించి మాట్లాడుతుంటే వారిపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర న్యాయం గురించి మాట్లాడినందుకు ఆయనకు పోలీసుల ద్వారా నోటీసులిప్పించి భయభ్రాంతానికి గురిచేశారు.
చంద్రబాబునాయుడు హయాంలో గంజాయి ఉత్పత్తిని కట్టడి చేయడం జరిగింది. నేడు జగన్ హయాంలో లారీలకు లారీలు గంజాయి తరలిపోతోంది. బస్సుల్లో, లారీల్లో, ట్రాక్టర్లలో స్కూటర్లలో గంజాయి సరఫరా జరుగుతోంది. ఎక్కడ చూసినా ఇసుక కొరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది. లక్షలాది కార్మికులు నేడు పనుల్లేక రోడ్డున పడ్డారు. చంద్రబాబునాయడు హయాంలో ఇతర రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చేవారు, నేడు రాష్ట్రం నుంచి బతుకుదెరువుకై ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వంలో చలనం లేదు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై దండన ఉంటోంది. ఇంతమందికి అమ్మఒడి, ఆసరా, దీవెన ఇస్తున్నామని ప్రజల సమక్షంలో చెప్పాలి, అంతేగాని బటన్ నొక్కుతున్నాను, వారి వద్దకు వెళ్లిపోతున్నాయి అనే మాటలు కట్టిపెట్టాలి. యువత భవిష్యత్తు బాగుపడటానికి ప్రణాళికలు రచించాలి. ప్రశ్నించేవారిని అణగదొక్క పద్ధతి మానాలి. రాష్ట్రంలో అనేక విమానాశ్రయాలు, ఓడరేవులు, ఉత్పత్తి వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రం దివాళా తీయకుండా చూడాలి. నిరుద్యుగులకు ఆశాజీవితాన్ని ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు సూచించారు.