Home » ప్రభుత్వం దుబారా తగ్గించుకొని కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలి

ప్రభుత్వం దుబారా తగ్గించుకొని కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలి

శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు
ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరిగిన దాఖలా లేదని, గతప్రభుత్వంలో వివిధరకాల అభివృద్ధిపనులుచేసిన కాం ట్రాక్లర్లు, గ్రామస్థాయిప్రజాప్రతినిధులు నేడు దుర్భరస్థితిలో ఉన్నా రని, రూ.80వేలకోట్లవరకు ఈ ప్రభుత్వం, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని, టీడీపీఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తెలిపారు. శని వారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా తమవంతు పాత్ర నిర్వహించిన కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకుండా, ఆర్థికపరిస్థి తిని సాకుగా చూపుతున్నప్రభుత్వం, పథకాలముసుగులో, ప్రకటనల పేరుతో వేలకోట్లను దుర్వినియోగంచేస్తోందన్నారు. అనే కప్రసారమాధ్యమాలకు ఈప్రభుత్వం దాదాపు రూ.1000కోట్ల వర కు ప్రకటనలరూపంలో దుబారాచేసిందన్నారు. దానికితోడు వివిధ సంస్థల్లో చేపట్టిననియమాకాలు, సీఎస్ లుగా పనిచేసి పదవీవిర మణ పొందిన నీలంసాహ్నీ, ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎన్జీవో నేత చంద్రశేఖర్ రెడ్డిలను అత్యున్నతపదవుల్లో నియమించి వారికి జీతభత్యాలపేరుతో లక్షలరూపాయలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. ఇలాంటి వాస్తవాలను పట్టించుకోని ప్రభుత్వం కాంట్రాక్టర్లచెల్లింపుల విషయానికివచ్చేసరికి డబ్బులులేవని చెబు తోందన్నారు.
కాంట్రాక్టర్లను ప్రభుత్వం వేధిస్తుండబట్టే, పోలవరం వంటి గొప్పప్రాజెక్ట్ పనులుకూడా నిలిచిపోయాయన్నారు. బ్యాంకు లనుంచి రుణాలు పొందుతున్న ప్రభుత్వం, ఆరుణాలను కూడా స్వార్థానికే వాడుకుంటోందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి అనేక రంగాలకు నిధులువస్తుంటే, వాటినికూడా ఏపీప్రభుత్వం దారిమళ్లి స్తోందన్నారు. కేంద్రమిచ్చే నిధులకు, రాష్ట్రవాటాగా చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లను ప్రభుత్వంచెల్లించకపోవడంతో, అమృత్, స్వచ్ఛ భారత్ వంటి ప్రాజెక్టులు అటకెక్కాయన్నారు. రూ.2వేలకోట్ల ఎన్ డీబీ నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటే, ఆపనులుచేయడానికి కాంట్రాక్టర్లెవరూ ముందు కు రావడంలేదన్నారు. ప్రభుత్వం రెండుసార్లు టెండర్లుపిలిచినా ఏ సంస్థా రోడ్డనిర్మాణానికి మొగ్గుచూపలేదన్నారు. చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రయ్యేనాటికి రాష్ట్రం రూ.16వేల కోట్ల రెవెన్యూలోటులోఉందని, అయినాకూడా టీడీపీప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పరుగులుపెట్టించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక ఎక్కడా ఎలాంటి అభివృద్ధి జరగకపోగా రాష్ట్రంపై రూ.3లక్షలకోట్లవరకు అప్పులను మిగిల్చారన్నారు.
ఉమ్మడిరాష్ట్రంలో 60సంవత్సరాలకాలంలో, రూ.60వేలకోట్లకు గతప్రభుత్వాలు రుణాలకు జామీనుదారుగా వ్యవహరిస్తే, ఈ ప్రభుత్వం కేవలంరెండున్నరేళ్లలోనే రూ.60వేలకోట్లకు రుణాలిచ్చిన సంస్థలకు ష్యూరిటీలు ఇచ్చిందన్నారు. ఎఫ్ఆర్ బీఎం ప్రకారం రాష్ట్రజీడీపీలో 3శాతం వరకుఅప్పులుచేసుకునే వెసులుబాటునుకూడా ఈప్రభుత్వం విస్మరించిందన్నారు. విచ్చల విడిగా నిబంధనలకు విరుద్దంగా, ఎక్కడికక్కడ అందినకాడికి అప్పులుతెస్తున్న జగన్ ప్రభుత్వం, అంతిమంగా రాష్ట్రాన్ని అప్పు లఊబిలోకి నెట్టేసిందన్నారు. 9వతేదీ వచ్చినా ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లు అందించలేని దుస్థితిలో ఈప్రభుత్వం ఉంద న్నారు. టీడీపీ హాయాలో ఉద్యోగులకు సకాలంలో జీతాలతో పాటు, పింఛన్ దారులకు పింఛన్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రప్రభుత్వ వైఖరిచూస్తుంటే, ము న్ముందు పరిస్థితిఎంతదారుణంగా ఉంటుందో తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు.
రూ.2,500కోట్లవరకు నరేగా నిధులను చెల్లించాల్సిన ప్రభుత్వం, సకాలంలో అపనిచేయలేదని, దానికి ఇప్పుడు కోర్టు తీర్పుతో రూ.6,500కోట్లు చెల్లించడానికి సిద్ధమై తగిన మూల్యంచెల్లించుకుంటోందన్నారు.
రాష్ట్రఅత్యున్నత న్యాయ స్థానం ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం ఖాతరు చేయడంలేదని, ప్రజలసొమ్ముని విచ్చలవిడిగా దుబారాచేస్తోంద న్నారు. కేవలం రంగులకోసమే రూ.3,500కోట్లవరకు ఈ ప్రభు త్వం దుర్వినియోగంచేసిందని రామారావు తెలిపారు. అప్పులు తెస్తున్న ప్రభుత్వం,ఆసొమ్ముతో సొంతసోకులకు పోతోందని, ఆ భారాన్నికూడా ప్రజలపైనే వేస్తోందన్నారు. మద్యం, ఇసుక అమ్మకాల రూపంతో పాటు, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఇంటిపన్ను,ఆస్తిపన్ను వంటివి పెంచేసి ప్రజలను దారు ణంగా దోచుకుంటున్నారని టీడీపీఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఆఖరికి ఈ ప్రభుత్వం నీటిపన్ను, చెత్తపన్నుతో ప్రజలను దారుణంగా దోచుకుంటోందన్నారు. ఆర్థికపరిస్థితిని చక్కదిద్దడం చేతగాని ఈప్రభుత్వం రాబోయే రోజుల్లో రిటైరైన ఉద్యోగులకు పింఛన్లుకూడా ఇవ్వలేని దుస్థితికి వస్తుందన్నారు.
ప్రభుత్వం తక్షణమే దుబారా ఖర్చులు తగ్గించుకొని కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.80వేలకోట్ల ను తక్షణమే చెల్లించాలని దువ్వారపు డిమాండ్ చేశారు. కాంట్రా క్టర్ల జీవించేహక్కుని హరించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. కాంట్రాక్టర్లు న్యాయస్థానాలను ఆదేశించి, చీవాట్లుపడేవరకు ప్రభుత్వం వేచిచూడకుండా, తక్షణమే వారిబకాయిలను చెల్లించాల న్నారు. ప్రభుత్వం పెంచిన వివిధరకాల పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపును నిరరిస్తూ, ప్రజలపక్షాన పోరాటంచేయడానికి తెలుగు దేశంపార్టీ సిద్ధమవుతోందన్నారు.

Leave a Reply