– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ఆఫీసుపై దాడి జరుగుతుంటే సమాచారమిచ్చినా పట్టించుకున్న నాథులు లేరు.రాత్రి కార్యాలయంలో ఒక అనుమానితుడు దొరికాడు. కాసేపు పోలీసునన్నాడు..మరి కాసేపు మీడియా అన్నాడు..మఫ్టీలో ఉన్న ఇంటిలిజెన్స్ అధికారని కాసేపు చెప్పారు.ఆరా తీస్తే పోలీసులు, వైసీపీ నాయకులు కలిసి ఈ దాడికి పాల్పడ్డారని తేలింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా భేషుగ్గా ఉన్నాయని ఈ రోజు డీజీపీ సెలవిచ్చారు.ఆయన పోలీసు అధికారా లేక వైసీపీ అధికార ప్రతినిధా అని అనుమానంగా ఉంది.భారతదేశంలో గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలో బయటపడుతున్నాయి.గంజాయి, డ్రగ్, లిక్కర్, బియ్యం మాఫియాలకు ఏపీ కేంద్రంగా మారింది..వీటిపై ఏనాడైనా ఏపీ డీజీపీ స్పందించారా?
సీఎం జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నాయకులు పదేపదే ఏదో మాట్లాడారని డీజీపీ తెగబాధపడిపోతూ చెప్పారు.ఈ జిల్లాలో ఐపీఎస్ అధికారి అయిన ఒక ఎస్పీని వైసీపీ ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టి మాట్లాడిన రోజు పోలీసు శాఖ ఏమైపోయింది.టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతోంది..వెంటనే స్పందించడని
సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కోరితేనే స్పందించని పోలీసులు ఈ రోజు తిరిగి మాపై ఎదురుదాడి చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి వారి అవినీతి, అక్రమాలను ప్రశ్నించకూడదనే ధోరణిలో ఉన్నారు..ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధించడం అలవాటుగా మార్చుకున్నారు.
రక్షణ కరువైందని సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..అందుకు బాధ్యులైన ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎందుకు కేసులు పెట్టడం లేదు.పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందనేది నిన్నటి ఘటనలతో బట్టబయలైంది.ఉదయం నుంచి టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం, కంటికి కనిపించిన మా కార్యకర్తలందరినీ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులకు రోడ్లపై వైపీపీ నాయకులు కనిపించలేదా?