‘బోసడీకే’ పదం తిట్టు కాదు: రఘురామకృష్ణరాజు

‘బోసడీకే’… ఏపీలో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారిన పదం ఇది. టీడీపీ నేత పట్టాభి నిన్న మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… ఈ పదాన్ని ఉపయోగిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత వెనువెంటనే రచ్చరచ్చ జరిగింది. వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం తెలిసిందే. మరోవైపు ‘బోసడీకే’ అంటే అర్థం తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ… ‘నిన్న సాయంత్రం 4.30 గంటల నుంచి రాష్ట్రం అతలాకుతలం అయింది. దీనికి కారణం… టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనకూడదని మాట అన్నారు. దానికి ఇది రియాక్షన్. పట్టాభి ఏమన్నారు అనేది నేను చూశా. హిందీ పదం అనుకుంటా అది. బోసడీకే అని అన్నారు. ఈ పదానికి అర్థం ఏమిటని నేనే నా స్నేహితులు ఇరవై, పాతిక మందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత మిత్రులను కూడా అడిగా. మాకు తెలియదు… బూతు పదమేమో అని వారు చెప్పారు. అప్పుడు నేను గూగుల్ లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. ‘సర్… మీరు బాగున్నారా’ అనేది సంస్కృతంలో బోసడీకే అనే పదానికి అర్థం’ అని వివరించారు.