ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. వైరా టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ కొడుకు బానోతు మృగేందర్‌పై చీటింగ్ కేసు నమోదైంది. తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బానోతు మృగేందర్ ప్రస్తుతం మధురైలో ట్రైనీ ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో మృగందర్ లాల్ ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో తనకు కజిన్ అవుతానంటూ ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని తరువాత ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
తనను పోలీస్ అకాడమీకి పిలిపించి తన గదిలోనే పలుమార్లు లైంగికంగా దాడిచేసినట్లు యువతి పేర్కొంది. చివరికి పెళ్లి చేసుకోవాలని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. అయితే యువతితో సంబంధం కొనసాగిస్తూనే మరో ఐఏఎస్‌తో పెళ్లికి సిద్ధమైమయ్యాడు బానోతు మృగందర్. యూపీకికి చెందిన తన బ్యాచ్‌మెట్ ఐఏఎస్‌తో పెళ్ళి నిశ్చయం చేసుకున్నాడు. ఈక్రమంలో తనకు జరిగిన అన్యాయాన్ని నిందితుడి తండ్రి బానోతు మదన్‌లాల్‌కు వివరించగా.. ఆయన పలుమార్లు తనను బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. కొడుకు చేసే పనులకు తండ్రి అండగా ఉంటున్నాడని, కొడుకును మరిచిపోకపోతే చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు చేసింది. తనని మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై కేసు నమోదైంది.