– ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ
సీఎం కుర్చీ కోసం ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుని జగన్ వాడుకుంటే, తెలంగాణలో షర్మిల వాడుతున్నారు. ఏపీలో అన్న తీసుకువస్తున్న రాజన్న రాజ్యం తెలంగాణలో చెల్లి తీసుకువస్తాను అని చెబుతోంది. జగన్, షర్మిల తలకిందులుగా తపస్సు చేసినా రాజన్న రాజ్యం తీసుకురాలేరు.
వైఎస్ పాలన ఒక స్వర్ణయుగం… మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. మా బాబుకి ఒక్క అవకాశం ఇవ్వండి, మా అన్నకి ఒక్క అవకాశం ఇవ్వండి అని తిరిగిన విజయమ్మ, షర్మిల ఎక్కడ ఉన్నారు ? చెల్లి షర్మిల…. ఏపీలో మీ అన్నయ్య చేస్తున్న అరాచకాలు మీకు కనిపించడం లేదా ?
తన బిడ్డల రాజ్యకాంక్ష తీర్చడం కోసం విజయమ్మ ధృతరాష్ట్రుడిగా మారి కట్టుకున్న భర్త పేరును నాశనం చేస్తున్నారు.ప్రపంచంలో విజయమ్మ లాంటి భార్య, తల్లి ఎవరు ఉండదు. అమరావతి మహిళలు పెడుతున్న ఆత్మఘోష మీకు కనిపించడం లేదా ?కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని షర్మిల మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన మీలాంటి వాళ్లు పార్టీకి వెన్నుపోటు పొడిచి తిరిగి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది. మీ జగనన్నకు ఓటు వేసిన పాపానికి ప్రజలు ఆలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. ఏపీలో వైసీపీ చేస్తున్న దూరగతాలపై ఎప్పుడైనా విజయమ్మ, షర్మిల జగన్ తో మాట్లాడారా ?