దొంగ దీక్షలు-నక్క వినయాలు చాలించు బాబూ..!?

– పట్టాభి బూతు వ్యాఖ్యలను సమర్థిస్తూ చంద్రబాబు దీక్ష చేస్తున్నారా..?
– పట్టాభి వాడిన ఆ పదం కరెక్టేనా అని మీ ఇంట్లో ఆడవాళ్ళను అడగండి బాబూ..?
– టీడీపీని తుదముట్టించడానికి, తాళం వేయడానికి ఒక్క లోకేష్ చాలు
– కోట్లాది మంది ఆరాధించే జగన్ ను అసహ్యంగా, నీచంగా మాట్లాడతారా..?
– మరి, టీడీపీలో పయ్యావుల కేశవ్ పెద్ద బద్మాషా..!?
-మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రెస్ మీట్
మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 36 గంట‌ల దొంగ జ‌పం ఒక‌టి జ‌రుగుతోంది. 40 ఏళ్ల ఇండ‌స్ట్రీ అని డ‌ప్పాలు కొట్టుకునే నీతిమాలిన రాజ‌కీయ నాయ‌కుడు చేస్తున్న‌టువంటి క్షుద్ర కార్య‌క్ర‌మాన్ని మ‌నం చూస్తున్నాం. న‌క్క విన‌యాలు, కొంగ జ‌పాలు, దొంగ మాట‌లు ఇక చాలించ‌మ‌ని దిగ‌జారిన రాజ‌కీయాలు చేస్తున్న‌ చంద్ర‌బాబు నాయుడుకు హిత‌వు ప‌లుకుతున్నాం.
74 ఏళ్ల చంద్ర‌బాబు జీవితాన్ని మొత్తంగా చూస్తే కుట్ర‌లు, కుతంత్రాలు ఏమార్చ‌డాలు, మ‌నుషుల్ని కొనుగోలు చేయడ‌మే క‌నిపిస్తాయి. చెప్పిన అబ‌ద్ధం చెప్ప‌కుండా, మ‌నుషుల‌్ని న‌మ్మించి ద‌గా చేయ‌డం, క‌నురెప్ప వేసి తెరిచేలోపు అకృత్యాలు చేయ‌డం రాజ‌కీయంగా ఎన్ని నీచాల‌కు ఒడిగట్టాలో అన్నీ చేసే, దుర్మార్గ‌పు రాజ‌కీయ చ‌రిత్ర‌ బాబుది. అనేక దుర్గుణాలతో పాటు, నిత్యం దుర్మార్గ‌పు ఆలోచనలు చేసే వ్య‌క్తి. ఆయ‌న చ‌రిత్ర‌ను చూస్తే ఏఒక్క‌రూ చంద్ర‌బాబును ఆద‌ర్శంగా తీసుకోకూడ‌ద‌నేలా ఉన్నారు. ఇవాళ చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష అని దొంగ జ‌పాన్ని మొద‌లుపెట్టారు. ఎందుకు ఈ దీక్ష‌? ఎవ‌రి కోసం ఈ దీక్ష‌?
ఒక పుణాత్యుడి పేరు పెట్టుకుని పాపాలు చేస్తున్న, బూతు పురాణం విప్పుతున్న ప‌ట్టాభి అనే వ్య‌క్తితో సాటి మ‌నిషిని ఎవ‌రూ కూడా వాడ‌కూడ‌ని ప‌ద‌జాలంతో సాక్షాత్తూ టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో కూర్చొబెట్టి బూతులు మాట్లాడించ‌డం చూశాం.
జ‌నం గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుని, రాష్ట్రంలో ముందెన్న‌డూ చూడ‌నంత‌గా ప్ర‌జ‌లు ఆరాధించే గౌర‌వ‌ప్ర‌ద‌మైన హోదాలో ఉన్న రాష్ట్ర ముఖ్య‌మంత్రిని, ఆయన త‌ల్లిని ఏహ్యంగా, నీచ ప‌ద‌జాలంతో మాట్లాడిన వీళ్ళని ఏమనాలి..?
ఇవాళ ఆ మాట‌ల్ని, ఆ బూతుల్ని స‌మ‌ర్థిస్తూ చంద్ర‌బాబు దీక్ష చేస్తున్నారా? ఎవ‌రి కోసం?
– దిక్కుమాలిన రాజ‌కీయాలు చేసే చంద్రబాబుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తెలియజేస్తున్నాం. ఇంత నీచానికి దిగ‌జారాల్సిన అవ‌స‌రం ఉందా.. అని చంద్ర‌బాబు త‌న అంత‌రాత్మ‌ను ప్ర‌శ్నించుకుంటే మంచిది
ఇవాళ‌ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్ర‌జాస్వామ్య‌బద్ధంగా ప‌రిపాల‌న సాగుతోంది కాబ‌ట్టే, ప్ర‌జాస్వామ్యం వెల్లివిరుస్తుంది కాబ‌ట్టే, మీ తండ్రీకొడుకుల ఆగ‌డాలు య‌థేచ్చ‌గా ఇంకా కొనసాగుతున్నాయి. అమరావతిలో ఈ ర‌కంగా దొంగ దీక్ష‌లు చేయ‌డ‌మే కాకుండా, ఆ దీక్ష‌ల్లో మ‌ళ్లీ మీ రౌడీ మూక‌ల‌తో నిన్న ఏదైతే ముఖ్య‌మంత్రిని అన‌కూడ‌ని మాట‌లు అనిపించావో, మ‌ళ్లీ అవే మాట‌ల‌ను మాట్లాడిస్తున్నావు.
జ‌నం గుండెల్లో గొప్ప స్థానాన్ని ఏర్ప‌ర్చుకున్న గొప్ప ప్ర‌జా నాయ‌కుడి గురించి, స‌భ్య స‌మాజం సిగ్గుప‌డేలా మాట్లాడితే… దానికి అభిమానం గుండెల్లో మొండుగా ఉన్న కుర్ర‌వాళ్లు ఆవేశ‌పెడితే దానికే రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని డిమాండ్ చేస్తారా.. ?
మీరు ఎవరి కాళ్లు ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారో… అదే అమిత్ షా, బీజేపీ జాతీయ‌ అధ్య‌క్షుడిగా ఉండి ఆయ‌న తిరుప‌తి వ‌స్తే ఆయ‌న కారుమీద అల్ల‌రి మూక‌ల‌ను ఎగ‌దోసిన‌ప్పుడు, రాళ్ళు వేయించినప్పుడు ఆర్టిక‌ల్ 356 మీకు ఎందుకు గుర్తుకు రాలేదు. రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని మోదీని ఆరోజు ఎందుకు అడ‌గ‌లేదు.
ఆరోజు జ‌రిగింది ఏంటి? జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరిలో ఉన్న అమిత్ షా వాహ‌నంపై దాడి చేయించిన‌ప్పుడు అప్పుడు పోలీసులు ఎక్క‌డ‌కు వెళ్లారు? మీరు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తే అమిత్ షా మీ నోటి నిండా గ‌డ్డిపెట్టి, ఫినాయిల్ వేసి క‌డ‌గ‌రా? మీ కార్యాల‌యంపై దాడి ఎందుకు జ‌రిగింద‌ని అడిగితే ఏం చెబుతారు?
చ‌ంద్ర‌బాబు … టీడీపీని ఎవ‌రు కూడా కూల్చాల్సిన ప‌నిలేదు. మీ పుత్ర‌ర‌త్నం ఒక్కడు చాలు. పైన ఉన్న ఎన్టీఆర్‌గారి శాపాలు, కింద ఉన్న మీ కొడుకు చాలు మీ పార్టీని కూల్చేందుకు. మీ పార్టీని తుదముట్టించేందుకు, మీ పార్టీకి తాళాలు వేయ‌డానికి ఎవరో అక్క‌ర‌లేదు, లోకేష్ చాలు.
కాంగ్రెస్ పార్టీ వినాశ‌న‌మే ల‌క్ష్యంగా ఉద్భ‌వించిన టీడీపీని, నాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని.. నేడు కుట్ర‌ల‌ు, అబ‌ద్ధాలు, కుతంత్రాలు, చివ‌ర‌కు బూతుల ఫ్యాక్ట‌రీగా మీరు త‌యారు చేశారు.
చంద్ర‌బాబు జీవితం అంతా అన్యాయం, అక్ర‌మాలు, మోసం, ద‌గా, నిలువెల్లా విషం నిండి ఉన్నాయి. ఇవాళ మీ పార్టీ నేత‌ ప‌య్యావుల కేశ‌వ్ గొంతు చించుకుని మాట్లాడుతున్నారు. బ‌్రిటిష్‌వాళ్లు చెప్పిన‌ట్లుగా ప‌య్యావుల కూడా టీడీపీలో పెద్ద బ‌ద్మాష్ క‌దా?
రాజకీయాల్లో ఎవరూ చేయని విధంగా, హేయంగా, నీచంగా ప్ర‌వ‌ర్తిస్తున్న చంద్ర‌బాబు … నిన్న ఓ వ్య‌క్తితో త‌న స్క్రిప్ట్ ప్ర‌కారం తిట్టించి నాకేమీ తెలియ‌ద‌ని చెబుతున్నాడు. ఈరోజు కూడా తాను దొంగ దీక్ష చేస్తూ, విజయవాడకు చెందిన ఒక క‌బ్జాకోరుతో మ‌ళ్లీ మ‌ళ్లీ అదే భాష‌ను మాట్లాడిస్తూ శున‌కానందం పొందుతున్న చంద్ర‌బాబును ఏమ‌నాలి? ఇవాళ బూతులకు మద్దతుగా దీక్ష‌లు చేస్తున్న దౌర్భాగ్యం దేశ రాజ‌కీయాల్లో ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నాం.
చంద్ర‌బాబు లాంటి దిగ‌జారిన వ్య‌క్తితో రాజ‌కీయాలు పంచుకోవాల్సి రావడం వైఎస్ జ‌గ‌న్ దుర‌దృష్టం. – 2016లో ప్ర‌జాసంఘాలు అన్నీ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని బంద్ ప్ర‌క‌టిస్తే.. బంద్ లు చేస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుప‌డిద్దని, రాష్ట్రం మీద చెడు ముద్ర ప‌డిద్దని, బంద్ అని బయటకు వ‌స్తే బొక్క‌లో వేయాల‌ని ఇదే చంద్రబాబు అన్నారు. మ‌రి అలాంటి చంద్ర‌బాబు నిన్న బంద్‌కు ఎందుకు పిలుపు ఇచ్చారు. అప్ప‌టి మీ సూక్తి ముక్తావ‌ళి ఏమైంది. మీరు బంద్‌కు పిలుపు ఇన్తే ఎవ‌రైనా సంఘీభావం తెలిపారా? చివ‌ర‌కు మీ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ షాపులు కూడా బంద్‌లో పాల్గొన‌లేదే? మీ తండ్రీ కొడుకు కూడా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాలేదే? ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీకి ఉన్న విలువ, మీ విలువ ఏంటో తెలుసుకోండి చంద్రబాబూ.
చంద్ర‌బాబును 2019 ఎన్నిక‌ల‌లో, ఆ తర్వాత జరిగిన స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నిక‌లలో ఘోరంగా ఓడించి, ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. . తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో కూడా అట్ల‌కాడ పెట్టి వాత పెట్టారు. రేపు బద్వేలులోనూ అదే జరగబోతుందని తెలిసి, ముందే పారిపోయాడు. 2024లో కూడా చంద్ర‌బాబుకు ఇదే దుస్థితి దాపురించ‌బోతుంది.
– ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డికి అన్నివర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా ఉన్నారు. ఎన్నిక‌ల ముందే టీడీపీని ప్ర‌జ‌లు ఇంటికి పంపించారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వ‌ర్గాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారి గుండెల్లో పెట్టుకున్నారు. ఈ విషయం నిన్న‌టి బంద్‌లో కూడా తేట‌తెల్లం అయింది.
ఏ రాజ‌కీయ పార్టీకి అయినా సిద్ధాంతాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. అది సంప్ర‌దాయం. కానీ రాజ‌కీయాల్లో ఏ సిద్ధాంతాలు, వాయివరుస‌లు లేకుండా దిక్కుమాలిన రాజ‌కీయాలు చేసేది ఒక్క చంద్ర‌బాబు మాత్ర‌మే. పాప‌పు సొమ్ముతో క‌ట్టిన పార్టీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగింద‌ని, ప్ర‌జ‌ల ఆస్థిని అక్ర‌మంగా అవినీతి సొమ్ముతో క‌ట్టావు కాబ‌ట్టే, ఆవేశం నిండిన ఇద్ద‌రు కుర్రాళ్లు వ‌చ్చి ఒక తోపు తోయ‌గానే గేటు విరిగిపోయింది.
అధికారం చేజారిపోతే.. ఎంత ఎబ్బెట్టుగా, ఏహ్యంగా రాజ‌కీయాలు చేయ‌డం అనేది మీ వ‌య‌సుకు సిగ్గు అనిపించ‌డం లేదా బాబు గారూ? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నారు? ఈ వ‌య‌సులో ఇన్ని నీచాలు, కుట్ర‌లు అవ‌స‌ర‌మా? ఉచ్ఛం, నీచం లేకుండా అస‌భ్యంగా మాట్లాడిస్తారా? ఇన్ని కుట్ర‌లు చేసినా మీరు ఆశించిన ఫ‌లితం మాత్రం రాలేదు క‌దా?
ఒక‌సారి మీ పార్టీ నాయకుడు వాడిన ప‌దానికి అర్థం, ఆ ప‌దం మాట్లాడ‌టం స‌మంజ‌స‌మా? అని మీ ఇంట్లో ఆడ‌వాళ్ల‌ను అడిగితే తెలుస్తుంది?. ముఖ్యమంత్రి జ‌గ‌న్ని ఇలా బూతులు మాట్లాడించాం స‌మంజ‌స‌మేనా అని మీ భార్య‌ల‌ను అడ‌గండి.
ప్ర‌జాస్వామ్యమే లేకుంటే మీరు పోలీసుల్ని కొడ‌తారా? డీజీపీని అస‌భ్యంగా మాట్లాడ‌తారా? స‌మాజం ఏమైపోయినా ప‌ర్లేదు, రాష్ట్రం రావణకాష్టం అయినా ప‌ర‌వాలేదు. నేను, నా కొడుకు అర్జెంటుగా అధికారంలోకి వ‌చ్చేయాల‌నే దిక్కుమాలిన ఆలోచ‌నలు చంద్ర‌బాబు చేస్తున్నాడు. – ఇలాంటి పాపాత్ములుకా అవ‌కాశం ఇచ్చింది అని ప్ర‌జ‌లు ఈరోజు బాధ‌ప‌డే ప‌రిస్థితి దాపురించింది. ఇప్ప‌టికైనా మీ దొంగ‌దీక్ష‌ను విర‌మించండి.
ఆ పార్టీలో ఒకాయ‌న అంటున్నాడు… నిన్న కాదురా. ఇప్పుడు సింహం(బాబు) ఇక్కడే ఉంది ఇప్పుడు వచ్చి కొట్టండిరా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అంటే చంద్రబాబుపై వాళ్ళ పార్టీ నాయకులకే ఎంత కసి, కక్ష ఉందనేది అర్థం అవుతుంది. 74ఏళ్ల ప‌ళ్లు ఊడిపోయిన‌ ముస‌లి సింహం ఏం చేస్తుంది. కొడ‌తాలు, క‌బ్జాలు, ఆక్ర‌మించుకోవ‌డం అనేది చంద్ర‌బాబుకే స‌రిపోతాయి.
ప్ర‌జ‌లు కూడా మొన్న ఉద‌యం నుంచి రాష్ట్రంలో జ‌రుగుతున్న ఏహ్యమైన, అతి జుగుప్సాక‌ర‌మైన రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు చూస్తున్నారు. త‌న కొడుకును అధికారంలోకి తీసుకురావాల‌నే పిచ్చి భ్రాంతితో చంద్రబాబు క్షుద్ర రాజ‌కీయాలు చేస్తున్నారు.
ఇప్పటికైనా, మీ తప్పు తెలుసుకుని, ప్ర‌జ‌ల క్షేమాన్ని గుర్తు పెట్టుకుని ఇవాళ సాయంత్రానికి నిమ్మ‌ర‌సం తాగేసి ఇంటికి వెళ్లిపోతే మంచిది. నిన్న‌, మొన్న‌, ఇవాళ‌ మీ భాష‌, మీరు వాడించిన ప‌దజాలాన్ని, మీ నీచ సంస్కృతిలో బ‌తుకుతున్న మిమ్మ‌ల్ని చూస్తుంటే జాలేస్తోంది.
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ది ఎక‌న‌మిక్ టైమ్స్ ప‌త్రిక‌ సెప్టెంబ‌ర్ 2, 2018లో భార‌త‌దేశానికి ఏపీ గంజాయికి రాజ‌ధాని అయింద‌ని వార్త వ‌చ్చింది. ఆ జాడ్యాన్ని అరిక‌ట్టేందుకు రెండున్న‌రేళ్ల నుంచి పోలీసులు, స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప‌నిచేస్తున్నాయి. చంద్ర‌బాబు చేసిన అప్పుల‌ను మా ప్ర‌భుత్వం తీర్చుతోంది.
చంద్ర‌బాబు లాంటి డ‌ర్టీయెస్ట్ పొలిటిషియ‌న్ ఎవ‌రూ లేర‌ని ప‌క్క‌రాష్ట్ర ముఖ్య‌మంత్రే స్వ‌యంగా ఉన్నారు. చంద్ర‌బాబు దిక్కుమాలిన లెక్క‌లు ఏంటంటే… మీడియాలో వైఎస్ జ‌గ‌న్‌, ప్ర‌భుత్వ అభివృద్ధి-సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వార్త‌లు క‌నిపించ‌కూడ‌దు. ఆయన, ఆయన కొడుకు మాత్ర‌మే పేప‌ర్లు, టీవీల్లో నిత్యం క‌నిపించాల‌ని అనుకుంటారు.

Leave a Reply