– రెస్కో చైర్మన్ జీఎస్ సెంథిల్‌కుమార్
చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపైరెస్కో చైర్మన్ జీఎస్ సెంథిల్కుమార్రెచ్చిపోయి తీవ్ర పదజాలం వాడారు.‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా… ’అని వ్యాఖ్యానించారు. ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెంథిల్ మాట్లాడుతున్నంత సేపు రెడ్డెప్ప సహా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతేకాదు ఇంకా చాలా బూతులే సెంథిల్ మాట్లాడారు. ఇన్నేసి మాటలు మాట్లాడినప్పటికీ స్టేజ్‌పై ఉన్న నేతలంతా ఆయన్ను ఎంకరేజ్ చేశారో కానీ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కాగా.. ప్రతిపక్ష పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. బెదిరిస్తున్నారన్న వైసీపీ నేతలు.. వీళ్లేం చేస్తున్నారో ఒకసారి చూడండంటూ ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.