– ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్ కు పొర్లుదండాలు పెడుతున్నాడు
– రాజకీయభిక్షపెట్టిన చంద్రబాబు, పరిటాలరవికి వెన్నుపోటు పొడిచాడు
– కృష్ణాజిల్లా ఆడపడుచులే వంశీ బట్టలూడదీసి బెంజ్ సర్కిల్ లో ఆయనక్ని సన్మానించే రోజు దగ్గర్లోనే ఉంది
– మాజీమంత్రి కొల్లు రవీంద్ర
వల్లభనేని వంశీ చంద్రబాబునాయుడు, పరిటాలరవి పెట్టినభిక్షతోనే ఈనాడు ఒకస్థాయిలోఉన్నాడని, కానీనేడు అతని మాటలు వింటుంటే, ఎంతలా దిగజారిపోయాడాఅనిపిస్తోందని, విశ్వాసఘాతకుడు అనేమాటకు వంశీనే నిలువెత్తునిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కొల్లురవీంద్ర స్పష్టం చేశారు. శనివారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
వంశీ నేడు వందలకోట్లకు ఎలా అధిపతి అయ్యాడో అందరికీ తెలుసు. టీడీపీగుర్తుపైగెలిచి, చివరకు ఆపార్టీకే వెన్నుపోటు పొడిచిన వంశీ, గతంలో చంద్రబాబు, లోకేశ్ ల దర్శనంకోసం పడి గాపులు పడింది నిజంకాదా? నేడు ఒకఆర్థికఉగ్రవాది, 16నెలలు జైలుజీవితం అనుభవించిన వ్యక్తి, సజ్జల చెప్పే డైరెక్షన్లో వంశీ మాట్లాడుతున్నాడు. తనకూఒక కుటుంబం ఉందని, ఏదిపడితే అది మాట్లాడితే వారు తనను అసహ్యించుకుంటారని వంశీ మర్చి పోతేఎలా? కృష్ణాజిల్లా రాజకీయనాయకులకు విలువలుంటాయని పేరు. కానీ వంశీ, నేడు తనపై ఉన్న కేసులను మాఫీచేయించు కోవడానికి దిగజారిమాట్లాడుతున్నాడు.
మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లా ఆడపడుచులను కించపరిచేలా వంశీ మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తిప్రతిష్ట లు పెంచింది కృష్ణాజిల్లానే. అలాంటిజిల్లాలో ఉంటూ, వంశీ ఎందు కు ఇంతలా దిగజారిపోయాడో ఆయనే ఆలోచించుకోవాలి.
పోలవరం కాలువగట్లను తవ్వుకొని, మట్టి అమ్ముకొని వంశీ వంద ల కోట్లుకాజేశాడు. ఆ విషయం తననియోజకవర్గమంతా తెలుసు. నేడు అక్రమార్జనకోసమే వంశీ వైసీపీలోచేరాడు. అవినీతిసొమ్ము కోసం వంశీ చంద్రబాబుని అంటే, రాబోయే రోజుల్లో అతనిచరిత్ర ముగిసిపోతుందని గ్రహిస్తే మంచిది. హైదరాబాద్ లోని తనఆస్తు లను కాపాడుకోవడానికి వంశీ కేసీఆర్ కు పొర్లుదండాలుపెడుతూ, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి కాళ్లుమొక్కుతున్నాడు.
వంశీ భాష నుచూసి ప్రజలంతా సిగ్గుపడుతున్నారు. పదవులకోసం మరీ ఇంతహీనంగా దిగజారతారా అని ప్రజలంతా వంశీని ఉద్దేశించి అనుకుంటున్నారు. వంశీ ఇప్పుడు మాట్లాడుతున్నదానికి త్వర లోనే విజయవాడ బెంజిసర్కిల్ లో ఆయనకు గుడ్డలూడదీసి సన్మానంచేయడం ఖాయం. కృష్ణాజిల్లా మంత్రులను అడ్డంపెట్టు కొని వంశీచేస్తున్న చీకటివ్యాపారాలు అందరికీ తెలుసు. వంశీకి చేతనైతే తన సొంత జిల్లాకు ఏదైనా మంచిచేయాలి. అంతేగానీ సంఘ విద్రోహశక్తులను పెంచిపోషించేలా, వారిని ప్రోత్సహించేలా వంశీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే, తగినశాస్తి చేయాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా ఆడపడుచులను అవమానించిన వంశీకి త్వరలో వారే బుద్ది చెబుతారని హెచ్చరిస్తున్నాం.
కృష్ణాజిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వంశీ ఇంటిదగ్గరచేరి అసాంఘిక చర్యలకు పాల్పడుతుంటారు. గడ్డంబాబా ఇసుకఎలా దోచుకోవాలంటే, మరోకాయన బుసకఎలా కాజేయాలంటాడు? పౌరసరఫరాల మంత్రి కొడాలినానీకి తనశాఖపై పట్టుందా? కృష్ణా జిల్లా రైస్ మిల్లర్లకు ప్రభుత్వంచెల్లించాల్సిన బకాయిలకు నానీ పర్సంటేజ్ అడిగి, చివరకు 8 శాతానికి ఒప్పుకున్నది నిజంకాదా? రైతులకు బకాయిలు ఇప్ప్పించడం నానీకిచేతగాదు.
ఇంకొకాయన ఉన్నాడు.. అందరూ బందరు సన్నాసి అంటున్నా రు. ఆయనేమో కులంపేరుతో బూతులు తిడుతుంటాడు. తన నియోజకవర్గానికి పేర్నినానీరూపాయికూడా కేటాయించలేదు. జిల్లాలో జరిగే ఇసుకమాఫియా మొత్తం మంత్రుల చేతుల్లోనే ఉంది. అదిచాలక నదిగట్లపైఉన్న బుసక, మట్టిని, పోర్టుప్రాంతాల్లో ఉన్న మట్టిని కూడా దోచేస్తున్నారు. మంత్రులంతా ఇలాఉంటే, ఎమ్మెల్యేలు మాకేంటంటూ వారివెంటపడుతున్నారు.