Suryaa.co.in

Features

గాంధీ కన్నా.. గాడ్సేనే గొప్ప!

-గాంధీ వైఖరే లక్షమంది హిందువులను బలిగొంది
– గాడ్సే.. నిష్ఠుర నిజాలు!
గాడ్సే ఒక దేశభక్తుడు గాడ్సే దేశం గురించి తన ప్రాణాలను.. తన కుటుంబాన్ని సర్వం దేశ ప్రజల కోసం త్యాగం చేశాడు. గాడ్సే లేకుంటే దేశం ఇంకో విధంగా ఉండేది. అది ఎలాగో .. కాంగ్రెస్ కమ్యూనిస్టు లారా చదవండి. గాడ్సే గురించి తెలియకుండా తప్పుడు మాట్లాడకండి. ప్రజలకు గాడ్సే ఎంత గొప్పవాడో ఇప్పుడే నిజాలు తెలుస్తున్నాయి.
చరిత్ర చెప్పని నిజాలు..
కేవలం గాంధీ కారణంగానే
ఒకే రాత్రి లక్ష మంది హిందువుల ఊచకోత….!!
దేశ విభజన సమయంలో కట్టుబట్టలతో పాక్ నుంచి భారత్‌లోకి వస్తున్న సుమారు లక్ష మంది 40 కి.మీ మేర క్యూ లైనును, భారత్‌లోకి రావడానికి వీల్లేదంటూ బలవంతంగా వెనక్కు పంపించాడు జాతిపీత.
“అక్కడ పరిస్థితి భయానకరంగా ఉంది, కనిపించిన హిందువులనల్లా నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు, మేము తప్పించుకుని వచ్చాము, తిరిగి వెళితే మమ్ములను బార్డర్‌లోనే నరికేస్తారు..మమ్ములను చంపించాలని మీరనుకుంటే మేమేం చేయగలం” అంటూ వాళ్ళు రోదిస్తూ మేమెళ్ళమని అక్కడే తిష్టవేస్తే, పోలీసులచే బలవంతంగా వెనక్కి నెట్టి పంపాడు గాంధీ..
అంతేకాకుండా “వాళ్ళు చంపితే మనం చంపించుకోవాలి..” అంటూ శాంతి వచనాలు పలికాడు..
వారు పాక్‌లో అడుగుపెట్టగానే జీహాదీలు, ఆ లక్ష మందినీ అదే రోజు రాత్రి చంపివేశారు..
ఈ ఘటన గాడ్సేను తీవ్రంగా ప్రభావితం చేసింది….
గాంధీకి మాత్రం కమ్యూనిస్టులు, ప్రపంచ దేశాలూ “ప్రపంచ శాంతి పితామహుడు” అంటూ బిరుదునిచ్చారు..
ఆయన వల్ల మొత్తంగా బలైపోయినది మాత్రం హిందువులు.. అదీ 10 లక్షల మంది.
నాథూరాం గాడ్సే – నారాయణ్ ఆప్తే
గాంధీ పుట్టిన దేశం లో గాడ్సే కూడ పుట్టాడు. మరి గాంధీ జీవిత చరిత్ర చదవడం ఎంత ముఖ్యమో…., గాడ్సే జీవిత చరిత్ర చదవడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం.
స్వాతంత్ర్యం వచ్చాక గాంధీ బతికితే 10 సంవత్సరాలు కావచ్చు.
కానీ గాడ్సే త్యాగం చేసిన జీవితకాలం, సుమారుగా 50 సంవత్సరాలు. మరి ఎవరైతే ఈ ఇంత జీవితాన్ని దేశం కోసం త్యాగం చేయగలడు?
గాడ్సే గాంధీ ని చంపాలనుకునేదానికి RSS వ్యతిరేకం అని తెలిసి, తానే సంఘ కార్యక్రమాల నుంచి తప్పుకున్నాడు. గాడ్సే లో దేశభక్తి, త్యాగం, ప్రేమ నేర్పింది RSS భావజాలమే అయినప్పటికీ, తాను తీసుకున్న నిర్ణయానికి దానితో దూరంగా ఉండటమే మేలని RSS కు దూరం అయ్యాడు.
1947 దేశవిభజన సమయంలో పాకిస్తాన్ ప్రాంతంలోని హిందువులు, సిక్కులు లక్షలాది మంది కొత్తగా గీసుకున్న సరిహద్దులు దాటి, ఇటువైపు ప్రవేశించాల్సి వచ్చింది.
ఈ సందర్భంలో మతకల్లోలాలు చెలరేగాయి. హిందువులు, సిక్కులు లక్షలాదిగా చనిపోయారు. హిందువుల శవాలతో కూడిన రైళ్ళు , లాహోర్ నుంచి అమృత్సర్కు చేరుకున్నాయి. ఢిల్లీలోకి పాకిస్తాను నుంచి , పది లక్షల మందికిపైగా కాందిశీకులు వచ్చి చేరారు.
హిందూ కాందిశీకులను కాదని, గాంధీ ఢిల్లీలో ముస్లింల రక్షణపైనే దృష్టి పెట్టారు. పైగా పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కుల్ని తిరిగి అక్కడికే పంపేయాలని, ఇక్కడ నుంచి అటువై పు వెళ్ళిన మహ్మదీయుల్ని తిరిగి భారత్ రప్పించాలంటూ మహాత్ముడు ప్రతిపాదించాడు.
పశ్చిమ పంజాబ్లో లక్షలాదిమంది హిందువుల్ని చంపేశారు. వారి శవాల్ని రైళ్ళలో వేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై సిక్కులు తిరగబడ్డారు. పాకిస్తాన్పై కాలుదువ్వారు. అప్పుడు కూడా సిక్కుల్ని నిలువరించేందుకు మహాత్ముడు నిరాహారదీక్షకు పూనుకున్నారు.
1948 జనవరి 13న పాక్కు రూ.55కోట్లు చెల్లించని పక్షంలో, తాను ఆమరణదీక్షకు కూర్చుంటానంటూ గాంధీ ప్రకటించారు. సరిగ్గా అదే రోజున సంస్కృత పండితుడు నారాయణఆప్టే గాంధీని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇలాంటి కారణాలే ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, గోపాల్ గాడ్సే మదన్లాల్ పహ్వా, భార్గే మరి కొంతమందిని కూడా గాంధీ హత్యకు ప్రేరేపించాయి. రానురాను గాంధీ మైనారిటీ అనుకూల వైఖరితో, హిందువుల్లో ఆందోళనలు చెలరేగాయి. మెజారిటీ హిందువులకు ఈ దేశంలో, హక్కుల్లేకుండా చేసేస్తారన్న భయం హిందూనాయకుల్లో ఆవహించింది.
శంకర్ క్రిస్టియా, గోపాల్గాడ్సే, మదన్లాల్పహ్వా, దిగంబర్ రామచందర్ బడ్గే, నారాయణఆప్టే, వినాయక్సావర్కర్, విష్ణుకర్కరే, నాథూరాం గాడ్సేలతో కూడిన బృందం.. 1948 జనవరి 31 న సాయంత్ర 5.14 నిముషాలకు మహాత్ముడిని హత్య చేసింది. అఖండ భారతాన్ని చీల్చడం యిష్టం లేని గాడ్సే, దానిని ఎలాగైనా భగ్నం చేయాలని.. దీనికి గాంధీజీ ని హత్య చేయడమే ఉత్తమ నిర్ణయంగా భావించి ప్రణాళిక రూపొందించాడు.
పోలీసుల విచారణలో గాడ్సే ఆశ్చర్యపోయే వివరాలను బయట పెట్టారు. 1934, 1944 మే లో, 1944 సెప్టెంబరు 9న ఇలా మూడు సార్లు తాను బాపూజీని హత్య చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. 1948 జనవరి 20న కూడా ప్రయత్నించి విఫలమయ్యానని గాడ్సే వ్యాఖ్యానించారు. అయిదో సారి అంటే జనవరి 30, 1948 తాను అనుకున్నది సాధించ గలిగానని వెల్లడించడం గమనార్హం. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే, అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు. గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు. స్వతంత్ర భారతదేశం లో ఉరితీయబడిన మొదటి వ్యక్తి గాడ్సే.
గాడ్సే కుటుంబానికి గాడ్సేనే ఆధారం. కానీ ఆయనకు దేశ భవిష్యత్తు ముందు తన కుటుంబ సమస్య చిన్నగా కనిపించింది. దేశం కోసం మరో త్యాగానికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు. మరి గాంధీజీ ని చంపిన తర్వాత పారిపోవాలని చూడలేదు గాంధీ చనిపోగానే ఎక్కువగా రోదించింది గాడ్సే నే.
గాడ్సే త్యాగం మరువరానిది ఒక వీరుడిలా తన ప్రాణాల్ని భారత మాత కోసం బలిచ్చిన త్యాగమూర్తి.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

LEAVE A RESPONSE