Suryaa.co.in

Andhra Pradesh

అంతర్జాతీయస్థాయిలో ఏపీ పరువుని జగన్ రెడ్డి మంటగలిపాడు

– ప్రపంచబ్యాంక్ నిధులను దుర్వినియోగంచేయడంద్వారా, రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్ట్ లకు నిధులురాకుండా చేశాడు
– ఎన్ డీబీ, ఏఐఐబీ నిధులుకూడా రాష్ట్రానికి రాకుండాచేశాడు
– ఆఖరికి రస్ అల్ ఖైమా సంస్థతో తనబినామీ ప్రతాపరెడ్డితో అల్యూమినియం కంపెనీపేరుతో ఒప్పందాలు చేసుకొని, లండన్ కోర్టులో ఏపీ అధికారులను నిలబెట్టాడు.
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకాలతో రాష్ట్రపరువు అంతర్జాతీయస్థాయిలో కూడా మంటగలుస్తోందని, రాష్ట్రానికి చెందిన మూడుప్రధానమైన అంశా లే అందుకు కారణమని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రజలప్రయోజనాలను, రాష్ట్రాభివృద్ధిని ముఖ్యమంత్రి ఎప్పుడో మర్చిపో యారు. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ కింద ప్రపంచబ్యాంక్ రుణం సమకూర్చింది. ప్రపంచబ్యాంక్ ఇచ్చిన రుణాన్ని ఏపీప్రభుత్వం డిజాస్టర్ రికవరీకింద వినియోగించకుండా దారిమళ్లించింది. దానికింద గతంలో పనులుచేసిన కాంట్రాక్టర్లకు డబ్బులుచెల్లించలేదు. దాంతో కాంట్రాక్టర్లం తా ఏపీప్రభుత్వతీరుపై నేరుగా ప్రపంచబ్యాంక్ కి ఫిర్యాదుచేయగా, వరల్డ్ బ్యాంక్ తక్షణమే డిజాస్టర్ రికవరీకింద పనులుచేసినవారికి అక్టోబర్ 15 కల్లా నిధులివ్వాలని రాష్ట్రాన్నిఆదేశించింది.
దానికిప్రతిగా జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్ట్ గడువుపెంచాలని కోరడంతో, వరల్డ్ బ్యాంకువారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.110కోట్లకు సంబంధించిన పనులుచేయకుం డా, గతంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ కిందపనులుచేసినవారికి బిల్లులు ఇవ్వకుండా ఎందుకిలా చేస్తున్నారని వరల్డ్ బ్యాంక్ రాష్ట్రఅధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దానికి సంబంధించిన కథనాలు ప్రపంచబ్యాంక్ చీవాట్లు పేరుతో పత్రికల్లో వచ్చాయి.
దాంతో వరల్డ్ బ్యాంక్ నేరుగా కేంద్రప్రభుత్వంతోనే మాట్లాడతామని తెగేసి చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం వల్ల జగన్ ప్రభుత్వం ప్రపంచబ్యాంక్ నుంచి రుణం పొందే అవకాశాన్ని కోల్పోయింది. దానివల్ల ప్రపంచబ్యాం క్ రుణంతో జరిగే అనేకపనులు ఎక్కడివక్కడే నిలిచిపోయే పరిస్థితి.
ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల పనితీరు ఆధారంగా బ్యాంకులు వాటికిచ్చే రుణాలకు మధ్యవర్తిగా ప్రపంచబ్యాంకు ఉటుంది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు అదికూడా ఆగిపోయే దుస్థితి తలెత్తింది. ఏపీలోని ఏఏ ప్రాజెక్టులకు రుణాలు నిలిపేస్తున్నామో స్పష్టంగా తెలియచేస్తూ, ప్రపంచబ్యాంక్ కేంద్రానికి లేఖరాసింది.
అదలాఉంటే, రాష్ట్రరహాదారులకు జిల్లాకేంద్రాలు, మండలకేంద్రాలను అనుసంధానించే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కూడా జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంతో ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.6,400కోట్లతో, 2,500 కిలోమీటర్లు రోడ్లు వేసేందుకు టీడీపీప్రభుత్వం గతంలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్ డీబీ) తో ఒప్పందంచేసుకుంది. రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ మెరుగుపడితేనే పారిశ్రామికీకరణకు మెరుగైన అవకాశాలుం టాయని భావించే టీడీపీప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది.
ఆ ప్రాజెక్ట్ పై కూడా నీలినీడలు కమ్ముకునేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించింది. వైసీపీప్రభుత్వ తీరుతో అనుమానం వచ్చిన ఎన్ డీబీ, తాము రుణమిచ్చే మొత్తంలో 75శాతాన్ని రాష్ట్రప్రభుత్వమే ముందు ఖర్చు పెట్టాలని, తరువాత దాన్ని రీయింబర్స్ చేస్తామని స్పష్టంచేయడం జరిగింది. ఎన్ డీబీ నిర్ణయం జగన్ రెడ్డి ప్రభుత్వం గొంతులో పచ్చివెలక్కాయ లాంటిది అనడంలో సందేహంలేదు. వరల్డ్ బ్యాంక్ ఏ అభివృద్ధి పనులకోసమైతే నిధులు ఇస్తోందో, వాటిని ఏపీప్రభుత్వం సద్వినియోగం చేయడంలేదు. దాంతో వరల్డ్ బ్యాంక్ బాటలోనే ఎన్ డీబీ కూడా తననిర్ణయాన్ని మార్చుకుంది.
వరల్డ్ బ్యాంక్ నిధులకింద గతంలో పనులుచేసిన కాంట్రాక్టర్లను ప్రభుత్వం బుజ్జగించి దారికి తెచ్చుకోవడానికి చేసినప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రప్రభుత్వం మంజూరు చేసే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వడంమానేసింది. అంతటితో ఆగకుండా కేంద్రప్రభుత్వమిచ్చే నిధులనే రాష్ట్రవాటాగా పరగణించి, నిధు లివ్వాలని ఏపీప్రభుత్వం బ్యాంకులను కోరడం మరో విచిత్రం.
రాష్ట్రంలో గ్రామీణప్రాంతాల్లో రహదారులు, మౌలికసదుపాయాల కల్పన కోసం గతంలో టీడీపీప్రభుత్వం ఏఐఐబీ (ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్)తో రూ.3,400కోట్ల నిధులిచ్చేలా ఒప్పందం చేసుకుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అడ్డగోలుగాచేస్తున్న పనులతో ఏఐఐబీ కూడా షరతులు పెట్టింది. తాము ఇచ్చిన నిధులకు సంబంధించిన పనుల్ని ముందు ఏపీప్రభు త్వం చేస్తే, తరువాత తాము చెల్లిస్తామని ఏఐఐబీ స్పష్టంచేసింది. ఏఐఐ బీ నిధులతో పనులుచేసిన కాంట్రాక్టర్లు కూడా బకాయిలకోసం కోర్టుల కు వెళ్లారు. ఎప్పుడో పనులుచేసిన వారికి డబ్బులు చెల్లించకుండా, ఈ ముఖ్యమంత్రి రోడ్లువేసేయండి అంటూ ఆదేశాలిస్తున్నాడు. కానీ రోడ్ల నిర్మాణం, పనులకు సంబంధించి కాంట్రాక్టెవర్లూ ముందుకురాని పరిస్థితి .
జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో, అన్ రాక్ అల్యూమినియం లిమిటెడ్ పేరుతో 2007లో ఒకకంపెనీ మొదలైంది. ఆ కంపెనీకి చెందిన పెన్నా ప్రతాపరెడ్డి జగన్మోహన్ రెడ్డికి బినామీ. సదరు కంపెనీ రస్ అల్ ఖైమా కంపెనీతో విశాఖ మన్యంలోని బాక్సైట్ తవ్వకాల కు సంబంధించి ఒప్పందం చేసుకుంది. అన్ రాక్ అల్యూమినియం కం పెనీ, రస్ అల్ ఖైమాతో ఒప్పందంచేసుకొని బాక్సైట్ తవ్వకాలకు సిద్ధమై న తరుణంలో విశాఖమన్యంలోని గిరిజనులు తిరగబడి, తవ్వకాలను అడ్డుకున్నారు. దాంతో రస్ అల్ ఖైమాతో చేసుకున్న ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం రద్దుచేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం అర్థంతరంగా ఒప్పందాలు రద్దుచేయడంతో రస్ అల్ ఖైమా వారు లండన్ కోర్టులో నష్టపరిహారం కోసం కేసువేశారు. ఆ కేసుకి సంబంధించి ఏపీ అధికారులు లండన్ కోర్టుకు వెళ్లడం జరిగింది. గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, డీఎం జీ.వెంకట్ రెడ్డి, మరో అధికారి శ్రీధర్ లండన్ వెళ్లొచ్చారు. సదరు వ్యవహారంపై ఈ నెల 22న మరలా లండన్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. అల్యూమినియం కంపెనీ పేరుతో జగన్ రెడ్డి బినామీ పెన్నాప్రతాపరెడ్డి, రస్ అల్ ఖైమా కంపెనీని మోసగిస్తే ఏపీ అధికారులు కోర్టులకు వెళ్లడమేంటని టీడీపీ తరుపున ప్రశ్నిస్తున్నాం.
రస్ అల్ ఖైమాకు అన్ రాక్ అల్యూమినియంకు మధ్య ఒప్పందంజరిగితే, దానితో ప్రభుత్వానికి సంబంధమేంటి? నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే, అన్ రాక్ అల్యూమినియం కంపెనీ ప్రతాపరెడ్డి చెల్లించాలి. కానీ ఏపీప్రభుత్వం రాష్ట్ర అధికారులను ప్రభుత్వఖర్చులతో లండన్ పంపడమేంటి? ఇందులో ఏపీ ప్రభుత్వానికి అసలు ఎలాంటిసంబంధంలేదుకదా? రస్ అల్ ఖైమా వారు ఏపీ ప్రభుత్వంపై కేసువేసినా, ప్రభుత్వం దానికి, తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పాలికదా? అలా చెప్పకపోతే, ఏపీప్రభుత్వమో, ప్రభుత్వ అధికారులో దోషులుగా నిలబడాల్సి వస్తుంది.
రేపు లండన్ కోర్టుకు హాజరయ్యే అధికారులు వాస్తవాలు చెప్పాలని కోరుతున్నాం. రస్ అల్ ఖైమా సంస్థకు నష్టపరిహారం చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశిస్తే, ఆ సొమ్ముని జగన్మోహన్ రెడ్డో, ఆయన బినామీ ప్రతాపరెడ్డో వ్యక్తిగతంగా చెల్లించాలి. అలాకాకుండా ఏపీప్రభుత్వ ఖజానానుంచి చెల్లించాలని చూస్తేమాత్రం టీడీపీ చూస్తూఊరుకోదని, అవసరమైతే న్యాయ పోరాటంచేస్తామని హెచ్చరిస్తున్నాం.
మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీప్రభుత్వసలహాదారులుగా జుల్ఫీ రౌడ్జీని నియమించారు. అతని పనేంటయ్యా అంటే, రస్ అల్ ఖైమా వంటి సంస్థలతో మాట్లాడి, ఏపీ ప్రభుత్వంలోని పెద్దలపై కేసులు లేకుండా చూడటం. సదరు జుల్ఫీ రౌడ్జీ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తు న్నాం. ఈ విధమైన నిర్వాకాలతో అతనుకూడా భవిష్యత్ లో ఇబ్బంది పడకతప్పదు. ప్రపంచ్ బ్యాంక్ నిధులు నిలిచిపోవడం, ఎన్ డీబీ, ఏ ఐఐబీ నుంచి నిధులురాకుండా ఆగిపోయేలాచేయడంతోపాటు, రస్ అల్ ఖైమా వ్యవహారంతో ఏపీప్రభుత్వ ప్రతిష్టను జగన్ ప్రభుత్వం అంతర్జాతీ యస్థాయిలో మంటగలిపిందని సుస్పష్టమవుతోంది.

LEAVE A RESPONSE