దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక 17వ వార్శికోత్సవం సందర్భంగా ఆదివారం రవీంద్ర భారతిలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు గురు సత్కారం చేశారు. తొలుత పూల పల్లకిలో షణ్ముఖ శర్మ ను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. గురు సత్కారం నిర్వహించి స్వర్ణ కంకణం తొడిగారు. ధార్మికవరేణ్య బిరుదును, జీవనసాఫల్య పురస్కారం ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణా చారి, తదితరులు పాల్గొన్నారు.