– చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లొచ్చాక జగన్ అండ్ గ్యాంక్ కి రూ.8వేలకోట్ల నష్టం వాటిల్లింది.
– ప్రతిపక్షనేత ఎన్ఐఏకు ఫిర్యాదుచేశాకే, సవాంగ్ అన్నయ్యకు రాష్ట్రంలోని గంజాయి గుర్తొచ్చిందా?
– వారంరోజుల్లో 9,200కిలోల గంజాయిపట్టుకున్నామంటున్న డీజీపీ, ప్రతిపక్షనేత ఢిల్లీకి వెళ్లకముందు రాష్ట్రంలో గంజాయేలేదని ఎలాచెప్పాడు?
– మాజీమంత్రి కే.ఎస్.జవహర్
చంద్రబాబునాయుడి ఢిల్లీ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి అతని గ్యాంగ్ కు, రూ.8వేలకోట్ల అక్రమ సంపాదనకు బ్రేక్ పడిందని, స్టేట్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ ఈబీ) పత్రికాప్రకటనే అందుకు నిదర్శనమని, 30-10-2021 నుంచి 05-11-2021వరకు ఏడురోజుల్లోనే 10వేల టన్నుల విలువైన గంజాయిపట్టుకున్నట్లు ఎస్ఈబీ చెప్పిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ పేర్కొన్నారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఎస్ ఈబీ ప్రకటనప్రకారం 10వేలటన్నుల గంజాయిని వారంరోజుల్లో పట్టుకున్నారు. మొత్తం 283కేసులు నమోదుచేస్తే, అరెస్టైన వారు 763 మందివరకు ఉన్నారు. ఎస్ఈబీ విభాగం పట్టుకున్న గంజాయి మొత్తం 9,266కేజీలు.వారంలోనే పదిటన్నుల గంజాయిపట్టుకుంటే, చంద్రబాబునాయుడు ఢిల్లీవెళ్లకముందు, ఈప్రభుత్వం అక్రమసంపాదనకోసం విచ్చల విడిగా వదిలేసిన గంజాయి ఎంతమొత్తం ఉంటుందో ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ఇక ఈ వ్యవహారంపై సుద్ధులుచెప్పే సవాంగ్ , గంజాయికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ, చంద్రబాబుకి నోటీసులి స్తున్నారు. సవాంగ్ ఇప్పుడుచేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ అక్టోబర్ 25కు ముందు ఎందుకుచేయలేదు?
ఈ పరివర్తన అనేది సవాగ్ లో వచ్చిందా…లేక ఇంకెవరిలోనైనా వస్తే, ఈయన దాడులు చేస్తున్నా రా అనేది తెలియాలి. ఏవోబీ ప్రాంతంలోకేవలం, 4500ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగవుతోందని డీజీపీ చెబుతున్నారు. కానీ రాష్ట్రంలోని 11 మండలాల్లో గంజాయిసాగు అవుతోందని నాతోపాటు, అందరూ చెబుతున్నారు. 2019కి ముందే 11 మండలాల్లో గంజాయిసాగు అవుతోంది. ఆ విషయం ఈ డీజీపీగారికి, ఆయనచేస్తున్న ఆపరేషన్ పరివర్తన్ కి తెలియదా?
డీజీపీ పరివర్తనలో భాగంగా 5రోజుల్లోనే 500 కిలోలు గంజాయి ధ్వంసంచేశారు…మంచిదే. కానీ ఈరెండున్నరేళ్లు పోలీస్ శాఖ ఎందుకు పడుకుండి పోయింది? అంతరాష్ట్ర పోర్టల్ ఇప్పుడు ఏర్పాటుచేసిన సవాంగ్, ఇప్పటివరకు ఏంచేశాడు? గంజాయి సాగు, రవాణాని ఎందుకు అరికట్టలేకపోయాడు? చంద్రబాబునాయుడు కేంద్రానికిఫిర్యాదుచేశాక, ఎన్ఐఏ స్పందించాక, సవాంగ్ అన్నయ్యకు మెలుకువ వచ్చిందా? పచ్చమీడియా అన్నీ అబద్ధాలు రాస్తోంది అంటా రు.. మరి బులుగు మీడియాలో ముమ్మరంగా ఆపరేషన్ పరివర్తన్ అనిరాసిన దానిపై, డీజీపీఏంచెబుతారు?
పోలీసులు చేస్తున్న తనిఖీ లు, పట్టుబడుతున్న గంజాయిపై కూడా బులుగుమీడియాలో వార్తలొచ్చాయి. ఈ తంతు జరక్కముందు, రాష్ట్రంలో గంజాయి ఎక్కడా లేదని చెప్పినడీజీపీ, ఇప్పుడు 9,266కిలోల ఎలా పట్టుకున్నా డు…ఎక్కడుంటేపట్టుకున్నాడు? రాష్ట్రంలో గంజాయి సాగే లేకపోతే, ఈ పరివర్తన్ ఎందుకు…ఎవరికోసమని డీజీపీని ప్రశ్నిస్తున్నాం.
గంజాయిసాగు పేరుతో డీజీపీ గిరిజనులను ఎందుకు బలిచేస్తున్నాడో సమాధానంచెప్పాలి? పెద్దపెద్ద తిమింగలాలను వదిలేసి, సామాన్య గిరి జనులను ఎందుకు దోషులుగా చిత్రీకరిస్తున్నాడని ప్రశ్నిస్తున్నాం. అసలు గిరిజనులు గంజాయిసాగువైపు మళ్లడానికి ఈ ప్రభుత్వం కార ణం కాదా? టీడీపీహాయాంలో గిరిజనులు మిరియాలు, కాఫీతోటలు, చెర్రీపంటలు సాగుచేశారు. గిరిజనాభివృద్ధి సంస్థలనుంచి సదరు వర్గపు యువతకు రుణాలిప్పించి, స్వయంఉపాధికల్పించాం. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతగుర్తింపు తీసుకొచ్చామోకూడా అందరికీ తెలుసు.
కానీఇప్పుడు పాలకులు వారిపై నిర్లక్ష్యం చూపడంతోపాటు, అధికారపార్టీ నేతల వేధింపులు, ఒత్తిళ్లుభరించలేక, వారికన్నుసన్నల్లో సాగవుతున్న గంజాయిసాగుకి బలవుతున్నదినిజంకాదా? ఈ వాస్తవాలు డీజీపీకి తెలియవా? టీడీపీ హాయాంలో 11మండలాల్లో గం జాయి పంటను ధ్వంసంచేస్తే, అందుకుగిరిజనులు కూడా సహకరించా రు. ఇప్పుడేమో ఈ డీజీపీ కేవలం కొన్నిగ్రామాల్లోనే గంజాయిసాగు ఉందని ఎలా చెబుతాడు? రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచడం కాదా?
గంజాయిపై మాట్లాడారంటూ ఈ డీజీపీ చంద్రబాబుకి నోటీసులిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా, జాతీయమీడియాసంస్థలు ఏపీలో సాగు అవుతున్న గంజాయి, ఇతరమాదకద్రవ్యాలపై స్పందించాయి. ఆయా మీడియా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వలేదు?
ఎన్ సీబీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) ప్రకారం ఏపీ పోలీస్ శాఖ మెరుగైన పనితీరు చూపిందని కూడా దిక్కుమాలిన సాక్షిపత్రికలో రాశా రు. అదే ఎన్ సీబీ నివేదిక ప్రకారం 2018లో మాదకద్రవ్యాలకు బానిస లై 196 మంది చనిపోతే, 2020లో 385మంది చనిపోయారు. రెండేళ్లలో జగన్ ప్రభుత్వంలో మాదకద్రవ్యాల బారినపడిన యువత చావులు రెట్టిం పు అయ్యాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఈ విధంగా కళ్ల ముందు వాస్తవాలు కనిపిస్తుంటే, ఈ డీజీపీ, ఆయనకు వత్తాసుపలికే బులుగుమీడియా డ్రగ్స్ కట్టడిలో భేష్ అని సిగ్గులేకుండా రాసుకుం టున్నారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్, ఇతర మాదకద్ర వ్యాలను అమ్ముకోవడానికే ఈ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను మూడుముక్క లుచేసింది. ఎన్ఐఏ గతంలో విజయవాడలో సోదాలు జరిపి కీలకమైన పత్రాలు స్వాధీనంచేసుకున్నామనిచెప్పేవరకు, ఈ డీజీపీ రాష్ట్రానికి, మాదకద్రవ్యాలకు సంబంధంలేదని సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాడు. డీజీపీ కార్యాలయమే పెద్ద వైసీపీ కార్యాలయంలా మారింది. అలాంటి ఆయన రాష్ట్రంలో కేవలం 4,500ఎకరాల్లో మాత్రమే గంజాయిసాగు ఉం దని ఎలాచెబుతాడు? రాష్ట్రవ్యాప్తంగా 25వేలఎకరాల్లో గంజాయి సాగవు తుంటే, డీజీపీకి 4500ఎకరాలే కనిపించడం విచిత్రంగా ఉంది.
ఒక వేళ ఆయనకు అంతాకనిపించకపోతే, తమతో వస్తే చూపిస్తాం. రాష్ట్రంలో యువత మత్తులో మునిగితేలడానికి, మాదకద్రవ్యాల బారిన పడటానికి ప్రభుత్వం పెంచిన మద్యంధరలే కారణమని వైద్యనిపుణులు చెబుతు న్నారు. మద్యం ధరలు పెంచడం వల్ల గంజాయిసాగు, మాదకద్రవ్యాల వాడకంపెరిగితే, వాటిని నియంత్రించకుండా డీజీపీ, టీడీపీవారికి నోటీసులిస్తున్నాడు.
గంజాయి ఎవరైతే రవాణాచేస్తున్నారో, వారు యథేచ్ఛగా ఇతరరాష్ట్రాల పోలీసులపై దాడులుచేస్తుంటే, ఏపీ పోలీస్ వారికి రక్షణ కల్పించలేకపోవడం డీజీపీ చేతగానితనం కాదా? తమస్వార్థంకోసం రాష్ట్ర యువతభవిష్యత్ ను సర్వనాశనంచేస్తున్న ముఖ్యమంత్రి, డీజీపీ టీడీపీ వారికి నోటీసులిస్తున్నారు. నోటిసులతో కాలక్షేపం చేయకుండా, ప్రజలకోసం ఏంచేస్తారో, యువతను ఎలా కాపాడతారో వారు సమాధా నం చెప్పాలి.