Suryaa.co.in

Telangana

తెలంగాణలో సాయంత్రం ప్రభుత్వం నడుస్తోంది: తరుణ్‌చుగ్ ఎద్దేవా

అధికారం మత్తులో కేసీఆర్ అహంకారంతో దేశరక్షణపై మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ రక్షణపై కేసీఆర్ వ్యాఖ్యలను తరుణ్ చుగ్ ఖండించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దేశరక్షణపై అహంకారంతో మట్లాడటం బాధాకరమన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్క ఇంచు భూమిని కూడా చైనా ఆక్రమించజాలదని ఆయన స్పష్టం చేసారేు. పెట్రోల్, డీజిల్‌పై 2015 ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచిందన్నారు. తెలంగాణలో సాయంత్రం ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా పెట్రోల్, డీజిల్ ధరలను కేసీఆర్ ఎందుకు తగ్గించరని తరుణ్ చుగ్ నిలదీశారు.

LEAVE A RESPONSE