మెట్రోరైల్‌పై కేటీఆర్ స్పందన

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ నె టిజన్ల సమస్యలపై వెంటనే స్పందిస్తుంటారు. అదే తరహాలో మెట్రో రైల్ టైమింగ్ విషయంలోనూ కేటీఆర్ స్పందించారు.
మెట్రో రైళ్లను ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ అభినవ్ అనే ఓ ప్రయాణికుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు కోసం ప్రయాణికులు స్టేషన్లకు చేరుకుంటున్నారని…. కానీ మెట్రో 7 గంటలకు ప్రారంభం కానుండడంతో సుమారు గంట పాటు వేచి చూడాల్సి వస్తోందని.. ప్రయాణికులు వేచి చూసే వీడియోను మంత్రి కేటీఆర్‌కు ట్విట్ చేశాడు. ఉదయం సమయంలో క్యాబ్‌ల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని దీనిని పరిశీలించాలని అభినవ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రోను అందుబాటులోకి తీసుకోచ్చే అంశాన్ని పరిశీలించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి మంత్రి కేటీఆర్ రిట్వీట్ చేశారు. నగరంలో మెట్రో రైళ్లు ప్రస్తుతం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. చివరి స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు చివరి ట్రైన్ నడుపుతున్నారు.మరి ఎన్వీఎస్‌రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply