త్వరలో సీఎం కేసీఆర్‌లో మునుపటి ఉద్యమ నేతను చూస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మళ్లీ ఉద్యమిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొడదామన్నారు. ఏడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ అసలు రూపం చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన్ని ఇలాగే చూడాలని రాష్ట్రంలోని అందరూ కోరుతున్నారని ఆయన అన్నారు.
పక్క రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మన అభివృద్ధి కనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ మన పక్కనున్న వారికి తెలియడం లేదని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. కళ్ళుండి చూడలేని కబోదులు ఇక్కడి బీజేపీ నేతలని కేటీఆర్ ఎద్దేవా చేసారు. ఢిల్లీ బీజేపీ నేతలు వరి వేయొద్దంటారన్నారు. కానీ ఇక్కడి సిల్లీ బీజేపీ నేతలు వరి వేయాలంటారని మంత్రి కేటీఆర్ చురకలంటించారు.
కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అధికారం ఇస్తే గుడ్డి గుర్రం పళ్లు తోమారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అనడానికి వారికి సిగ్గుండాలని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.