Suryaa.co.in

Andhra Pradesh

పెద్దిరెడ్డి తమ్ముడు దొంగ ఓటర్లను తీసుకొచ్చాడు

– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అహాస్యామవుతోంది. బాబాయ్ ని గొడ్డలి పోటుతో, ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓటుతో జగన్ రెడ్డి ఖూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ గూండాలు రాష్ట్రమంతా అరాచకాలు సృష్టించడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి 3 రోజులుగా కుప్పంలోనే మకాం వేసి దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నాడు. కుప్పం విజయవాణి స్కూల్ కి మహిళలను తోలుకొచ్చి దొంగఓట్లు వేయించాడు. మంత్రి తమ్ముడ్ని కుప్పం మహిళలు ఎదురించి తరిమి, తరిమి కొట్టారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలాడుతున్నారు.
కుప్పం వచ్చిన మహిళలు వంటవాళ్లంటూ సాక్షిలో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. వచ్చినవాళ్లు వంటవాళ్లయితే వారి దగ్గర బ్యాగులు ఎందుకున్నాయి. వారంతా సిగ్గుతో మొహాలు కనపడకుండా ఎందుకు దాచుకున్నారు? పుంగనూరు, తంబళ్లపల్లె నుంచి పెద్దిరెడ్డి తమ్ముడు దొంగఓటర్లను తీసుకొచ్చాడు. కడప శివారులో ఉండే వారికి కుప్పంలో ఏం పని? తమిళనాడు నుంచి వచ్చిన బస్సులను పోలీసులు ఎందుకు సీజ్ చేయలేదు?
వైసీపీ గూండాల అరాచకాలపై కుప్పం మహిళలు వీరోచితంగా పోరాడారు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. కుప్పం మహిళలే కాదు యావత్ రాష్ట్ర మహిళలంతా వైసీపీ అప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకు కాళీమాతలుగా మారారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరించాల్సిన అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తపాలా డ్యూటీ మాత్రమే చేస్తోంది. ఎన్నికల కమిషన్ విధి విధానాలు ఏంటో నీలం సాహ్నికి తెలుసా? నీలం సాహ్ని ఐఏఎస్ పదవికే కళంకం తెస్తున్నారు . నామినేషన్లు వేయకుండా వైసీపీ గూండాలు బెదిరిస్తే భయపడకుండా టీడీపీ క్యాడర్ ఎదుర్కున్నప్పటికీ వైసీపీ నేతలకు సిగ్గు రాలేదు. వైసీపీ అరాచక పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారు.

LEAVE A RESPONSE