Suryaa.co.in

Andhra Pradesh

గుంటూరులో టిడిపికి కలిసి వచ్చిన వైసిపి విభేదాలు

గుంటూరు నగర పాలక సంస్థ 6 డివిజన్ ఉప ఎన్నికలలో టిడిపి ఘన విజయం సాధించింది. వైసిపి నేతల మద్య ఉన్న గ్రూపు రాజకీయాలే టిడిపి కి కలసి వచ్చాయానే వాదనలు వినిపిస్తున్నాయి. 6 వ డివిజన్ గుంటూరు తూర్పు నియోజకవర్గం లో ఉంటుంది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా కు నగరం లోని ఇతర వేసిపి నేతలకు పొసగడం లేదు. ఈ నేతల మద్య ఆదిపత్య పోరే పార్టీ అభ్యర్ది పరాజయానికి దారి తీసిందని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
తన నియోజకవర్గం లో ఉన్న 6 డివిజన్ అభ్యర్థి ఎంపిక విషయం లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి జోక్యం ముస్తఫా కు మింగుడు పడలేదట. సామాజిక సమీకరణలలో పాదార్తి గాంధీ మరణం తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన ఆత్మకూరి నాగేశ్వరరావు ను వైసిపి అభ్యర్దిగా ఎంపిక చేశారు. అభ్యర్థి ఎంపిక మరుక్షణం లోనే మద్దాలి గిరి ని టార్గెట్ చేస్తూ కరపత్రాలు కూడా తయారు చేసి సోషల్ మీడియా లో విసృతంగా ప్రచారం చేసారు. నాన్ లోకల్ అభ్యర్థి కు తూర్పు నియోజకవర్గం ఎలా సీటు కేటాయిస్తారని, 6 డివిజన్ సీటును అమ్ముకున్నారనే ఆరోపణలు చేస్తు ప్రచారం చేశారు. అభ్యర్థి నాన్ లోకల్ అనే ముద్ర బాగా పడింది.
దీనికి తోడు వైసిపి అభ్యర్థి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్దగా ఓట్లు వేసేందుకు లేకపోవడం తో ఓటింగ్ శాతం 40 శాతానికే పరిమితం అయింది. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఓట్లు వేసేందుకు పెద్దక బయటకు లేకపోవడం కూడా వైసిపి అభ్యర్థి ఓటమికి కారణం అయింది. మరో వైపు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కు , నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు లకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా కు పడటం లేదని బహిరంగంగా ప్రచారం జరుగుతుంది. ఇరు వర్గాల మద్య ఆదిపత్యపోరు వైసిపి అభ్యర్థి ఓటమి కారణమనే ప్రచారం జరుగుతుంది.
తూర్పు నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు కావడంతో గుంటూరు నగరం లో కీలకంగా ఉన్న లేళ్ళ అప్పిరెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు నగర మేయర్ కూడా నామమాత్రంగా ప్రచారం చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇక అభ్యర్థి కు సీటు ఇప్పించుకున్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి అతనిని గెలిపించుకోవడంలో విఫలం అయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తుంది. మద్దాలి గిరి తన సామాజిక వర్గానికి చెందిన, ఆత్మకూరి నాగేశ్వరరావు అయితే సీటు ఇప్పింటుకున్నారు గానీ ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను పోలీంగ్ కేంద్రాలకు తీసుకురావడం లో విఫలం అయ్యారనే ప్రచారం జరుగుతుంది.
మొత్తంగా తూర్పు నియోజకవర్గం లోని 6వ డివిజన్ లో జరిగిన ఉప ఎన్నిక టిడిపికి బాగా లాబించింది. తూర్పు నియోజకవర్గంలో స్టిటింగ్ స్దానం ఓడిపోవడంతో ఎమ్మెల్యే ముస్తఫాకు మైనస్ కాగా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కు సీటు ఇప్పించుకోని గెలుపించుకోలేని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరికి కూడా ఈ ఓటమి మైనస్ గానే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఒక్క కార్పోరేటర్ ఎన్నిక , ఇద్దరు ఎమ్మెల్యే లను దెబ్బతీసిందట. వైసిపి లో ఉన్న గ్రూపు రాజకీయాలను టిడిపి తొలి నుంచి గమనిస్తూ తమకు అనుకూలంగా మార్చుకోని టిడిపి అభ్యర్థి గెలుచుకున్నారు . కాపు సామాజిక వర్గానికి చెందిన పోతురాజు సమతా అత్యధిక ఓట్లు తో గెలుపొందడం టిడిపి క్యాడర్ లో నూతన ఉత్సాహం నింపింది.

LEAVE A RESPONSE