– మాజీ ఎం.పి. కొనకళ్ళ నారాయణ
మచిలీపట్నం :- తెలుగుదేశం పార్టీ నాయకుడు 40 సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతను పట్టుకుని జగన్ రెడ్డి, వైసిపి మంత్రలు, ఎమ్మెల్యేలు వాడిన భాష పదజాలం బజారులోని ఫ్లాట్ ఫాంగాళ్ళకు మీకు తేడా ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాం అని మాజీ ఎం.పి. కొనకళ్ళ నారాయణ హితవు పలికారు.
రాజకీయాలంటే ఎంతో విలువలతో కూడిన ప్రజాసేవ. దాన్ని మరచి ప్రతిపక్షాలను వేధించడం, కించపరచడం, దాడులు చేయడం అనే సంస్కృతితో రాజకీయాలను భ్రస్టు పట్టిస్తున్నారు ఈ వైసిపి నేతలు.
నాయకుడంటే సేవకుడిగా వుండాలి కాని ఇలా కక్షలు, పగా ప్రతీకారాలతో ఉండకూడదని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు మీ దూషణలకు కలత చెంది కన్నీరు పెట్టుకుంటే, ఆ సందర్భాన్ని కూడా మీరు వెకిలిగా ఎద్దేవ చేస్తుంటే మనస్సు తరుక్కుపోతుంది. మీలో అసలు మానవత్వం వుందా, మీరసలు మనుషులేనా అనే అనుమానం కలుగుతోంది.
అధికారం శాశ్వతం కాదు. గుర్తు పెట్టుకోవాలి నాడు రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు గారి తల్లిని విమర్శించి తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు.
నేడు చంద్రబాబు సతీమణీ ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా వారు జీవిస్తుంటే ఆమెను కూడా రాజకీయాల్లోకి లాగి ఆమెకు అనుచిత వ్యఖ్యలు చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి చూస్తు సంతోషిస్తున్నాడు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని కొనకళ్ళ నారాయణ రావు హెచ్చరించారు.