– ఏపీ అసెంబ్లీలో ఘటనపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
రాజకీయంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలిచివేసింది. సమస్యలన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఆరాచక పాలనకు నిదర్శనం. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి. మన నవ నాడుల్లో, రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం. మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి.