Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వం వికేంద్రీకరించాల్సింది అభివృద్ధిని, పరిపాలనను కాదు

-మూడురాజధానులపై జగన్ వెనక్కుతగ్గడంలోని ఆంతర్యమేంటో ఆయనే ప్రజలకు స్పష్టంచేయాలి -స్వార్థంతో తీసుకునే నిర్ణయాలు ఆయన్నే కబళిస్తాయి
• ఎక్కడ ఉండే వనరులను బట్టి, అక్కడ పరిశ్రమలు నెలకొల్పే ఆలోచనలు ప్రభుత్వం చేయాలి
• అదిచేయకుండా రాజధాని పేరుతో మసిపూసి మారేడుకాయచేయాలనిచూస్తే ప్రజలచేతిలో జగన్ కు పరాభవం తప్పదు
-టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
రాష్ట్రశాసనసభలో రాజధాని గురించి మరోగిమ్మిక్కు చేయడానికి పిట్టకథలమంత్రి బుగ్గన, ముఖ్యమంత్రి నాటకాలను రక్తికట్టించే ప్రయత్నాలకుతెరలేపారని, మూడురాజధానుల బిల్లుని మరింతబలంగా తయారుచేసి తిరిగిసభలోపెడతామన్న వారిమాటలు, రాజధాని ఉద్యమాన్ని చల్లార్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నాయని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు స్పష్టంచేశారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు…!
ఉద్యమాలకు ప్రభుత్వాలు దిగిరాకతప్పదని రాజధానిరైతుల ఉద్యమంతో తేలిపోయింది. రాష్ట్రంలో రాజధానికి భూములిచ్చిన రైతులఉద్యమంధాటికి జగన్ ప్రభుత్వం కొంతవరకు దిగివచ్చినట్టే కనిపిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులఉద్యమం ధాటికి జగన్ ప్రభుత్వం కొంతవరకు దిగివచ్చినట్టే కనిపిస్తోంది. శాసనసభలో రాజధాని గురించి మరోగిమ్మిక్కు చేయడానికి పిట్టకథలమంత్రి బుగ్గన, ముఖ్యమంత్రి ప్రయత్నించినట్టు స్పష్టమవుతోంది. నేరాలోచనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలి. రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించడానికే ప్రభుత్వం మూడురాజధానుల బిల్లుని వెనక్కుతీసుకుంటే, భవిష్యత్ లో పాలకులు ఇంకా నష్టపోవడం ఖాయం. ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా నిర్ణయం తీసుకుంటే, రెండున్నరేళ్లలో ఏం అభివృద్ధిచేసింది? విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలు గతప్రభుత్వంలోనే అభివృద్ధిచెందాయని బుగ్గన మాటల్లోనే స్పష్టమైంది.
చంద్రబాబునాయుడు గతంలో రాష్ట్రాభివృద్ధిని డీ సెంట్రలైజ్ చేశారు. అనేక జాతీయ విద్యాసంస్థలను వివిధప్రాంతాల్లో నెలకొల్పారు. తిరుపతిలో కొన్నిసంస్థలు, మంగళగిరిలో, విశాఖపట్నంలో మరికొన్ని ఏర్పాటుచేశారు. ఈ ప్రభుత్వానికి పరిపాలనను వికేంద్రీకరించే హక్కులేదు. రాజ్యాంగానికి లోబడే పరిపాలన అనేది ఎప్పూడు కేంద్రీకృతమై ఉంటుంది. అభివృద్ధిని వికేంద్రీకరించే హక్కు మాత్రమే ప్రభుత్వాలకు ఉంటుంది. పరిపాలనను వికేంద్రీకరించే హక్కు ప్రభుత్వానికి లేదు..ఎన్నటికీ రాదు కూడా. ప్రభుత్వం ఏజిల్లాల్లో ఎలాంటి వనరులున్నాయి.. అక్కడ ఎలాంటిపరిశ్రమలు ఏర్పాటుచేయాలనేదిశగా ఆలోచనచేయాలి. అలాంటి ఆలోచన ఈప్రభుత్వానికి లేనేలేదని ఈ రెండున్నరేళ్లలో తేలిపోయింది.
మూడురాజధానుల నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్న ప్రభుత్వం, ఆ నిర్ణయం శాశ్వతమోకాదో చెప్పాలి. గతంలో అమరావతిని కమ్మరావతి అని, పందులు తిరిగే ప్రాంతమని, ఒకకులం వారిదని జగన్ అండ్ కో ఎద్దేవాచేశారు. మరి ఇప్పుడు అదేరాజధానికి అనుకూలంగా వ్యవహరించడానికి సిద్ధమైందా? అలాఅయితే ఎందుకు అయిందో ప్రజలకు చెప్పాలి. మరీ ముఖ్యంగా రాజధానికి తమభూములుధారపోసిన రైతులకు సమాధానంచెప్పాలి. దళితులనియోజకవర్గంలో రాజధాని ఉంటే, అది దళితులకు గర్వకారణమైంది.
అలాంటి దళితుల గౌరవాన్ని కాపాడేలా ఈ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారాలేదా అనేది ఆయనే సమాధానంచెప్పాలి. రాజధాని ఉన్నప్రాంతమొక్కటే దళితులనియోజకవర్గం కాదు. దానిచుట్టూ ఉన్న నియోజకవర్గాలుకూడా దళితులుప్రాతనిథ్యం వహిస్తున్నవే. ఆక్రమంలోనే రాజధానిలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 125అడుగుల విగ్రహం పెట్టాలనికూడా చంద్రబాబుగారు నిర్ణయించారు. కానీ జగన్ దళితులఅభివృద్ధినిఓర్వలేక అమరావతిని సర్వనాశనంచేశాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నేరాలోచనలు, జిమ్మిక్కులు చేయడం మానేసి, పిట్టకథలు చెప్పకుండా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గింది కేంద్రమిచ్చే నిధులకోసమా అన్న సందేహంకూడాఉంది. కేంద్రమిచ్చే నిధులుతెచ్చుకొని, వాటిని పప్పుబెల్లాల్లా మింగేసి, తరువాతచూద్దాంలే అనేఆలోచనలో ప్రభుత్వముంటే మాత్రం, అందుకు తగిన మూల్యంచెల్లించుకోకతప్పదు. అలానే రాజధాని ఉద్యమాన్ని ఆపాలనో, రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించాలనో, లేక చంద్రబాబుగారి సతీమణిని దూషించిన అంశంప్రజల్లో చర్చకురాకూడదనో ముఖ్యమంత్రి మూడురాజధానులపై వెనక్కు తగ్గినట్టు నటించాలనిచూస్తే మాత్రం, ఎప్పటికీ తప్పించుకోలేడు. తనస్వార్థంకోసం చేసే పనులు జగన్మోహన్ రెడ్డినే దహిస్తాయి.

LEAVE A RESPONSE